రేవంత్ సర్కార్‌ను ఇరుకున పెట్టేదెవరు?

Who will replace KCR,Who replace KCR,Who will replace, Revanth Sarkar, KCR, BRS, Congress, CM Revanth Reddy, KTR, Harish Rao,Telangana Election 2023,What Went Wrong for KCR,Mango News,Mango News Telugu,CM Revanth Reddy Latest News,Telangana Latest News And Updates,Telangana Politics,KCR defeated at Kamareddy, Telangana Political News And Updates,CM Revanth Reddy Latest News,Harish Rao News Today,KTR Live Updates,Revanth Sarkar Live News
Who will replace KCR, Revanth Sarkar, KCR, BRS, CONGRESS, CM REVANTH REDDY, KTR, HARISH RAO

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కొద్ది రోజులుగా జరిగే పరిణామాల బట్టి.. ఈరోజు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమవడం దగ్గర నుంచి.. తర్వాత  జరగబోయే సభ కార్యకలాపాలు అన్నీ  కూడా రసవత్తరంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య  వివిధ శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ పాలనలో వాస్తవ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయడానికి కూడా కసరత్తు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ వల్ల యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్.. ఈ రోజు  ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. అయితే డిశ్చార్జ్ అయినా కూడా మరి కొన్నాళ్ల పాటు కేసీఆర్ డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడం వల్ల  కేసీఆర్ ఇంకా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అలాగే  కేసీఆర్ ఆరోగ్య కారణాల వల్ల.. ప్రస్తుతం ఆయన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

అయితే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటే సభలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు నాయకత్వం వహించేది ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ ఎల్పీగా ఇక కేసీఆర్ ఉండరని ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. కేసీఆర్ జాతీయ నాయకత్వం వైపు పూర్తి ఫోకస్ చేస్తారని..   భవిష్యత్ అవసరాల కోసం ఆ బాధ్యతలను కేటీఆర్‌కు లేదా హరీశ్ రావుకు అప్పగిస్తారనే వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా మళ్లీ కేసీఆర్‌నే ఎన్నుకున్నారు.

ఇక కేసీఆర్ పాలనలో వాస్తవ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారనే టాక్ వినిపించడంతో..ఇదే కనుక జరిగితే బీఆర్ఎస్ ఇన్నాళ్లూ తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం  మాయమాటలతో మభ్యపెట్టిందనే ప్రచారాన్ని కాంగ్రెస్ జనాల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థలతో పాటు.. పార్లమెంట్‌ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి.

ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డిని సమర్ధవంతంగా ఎదుర్కోవడం.. కాంగ్రెస్ సర్కారును తెలివిగా డిఫెన్స్‌లోకి నెట్టడం ప్రతిపక్ష పార్టీగా మారిన బీఆర్ఎస్ పార్టీ ముందున్న అతిపెద్ద టాస్క్. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేసీఆర్ సభకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు.  దీంతో అసెంబ్లీలో  బీఆర్ఎస్ సభ్యులను ముందుండి నడిపిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నిసర్కార్‌ను ఇరుకున పెట్టే బాధ్యతలను కేటీఆర్ లేదా హరీష్ రావు కానీ తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.  అయితే ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు ఈ బాధ్యతను తీసుకోబోతున్నారనేది అనేది ఆసక్తిగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =