ఇస్రో కు దేశమంతా అండగా ఉంది- సీఎం జగన్

Ap Cm Ys Jagan Latest News, CM YS Jagan Latest News, ISRO About Chandrayaan 2 Satellite, ISRO lost communication with Chandrayaan 2 Vikram Lander, Mango News Telugu, Our Scientists Made India Proud, Our Scientists Made India Proud Says AP CM, Our Scientists Made India Proud Says YS Jagan, Our Scientists Made India Proud-AP CM YS Jagan, Vikram lander, YS Jagan Latest News, YS Jagan Responds Over ISRO Chandrayaan 2

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగి చివరిలో చేజారిపోవడంతో దేశంలోని ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. ల్యాండర్ దాదాపుగా చంద్రుని ఉపరితలానికి చేరుకుందని, మన ఇస్రో శాస్త్రవేత్తలను చూసి యావత్ దేశం గర్వపడుతుందని పేర్కొన్నారు. చివరి సమయంలో తలెత్తిన ఎదురుదెబ్బలను కూడ, భవిష్యత్ లో సాధించే విజయాలకు ఒక మెట్టుగా మలుచుకోని ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్టసమయంలో యావత్ దేశమంతా ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా ఉంటుందని, వారి అద్భుతమైన కృషిని కొనియాడుతుందని సీఎం జగన్ అన్నారు.

టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుడా ఇస్రో కు అండగా నిలిచారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతూ ట్విట్టర్లో స్పందించారు. ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగ పర్వంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషి, సవాళ్ళను ఎదుర్కొన్న తీరుకు భారతదేశం గర్విస్తోందని చెప్పారు. ల్యాండర్ విక్రమ్ విషయంలో ఆఖరి క్షణంలో అవరోధం ఎదురైనా ఇప్పటి వరకు సాధించింది తక్కువేమీ కాదని, దేశమంతా ఇస్రో టీమ్ వెంటే ఉందని, మున్ముందు మనమనుకున్నది సాధిస్తామని చెప్పారు.


Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here