వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏమన్నదంటే?

Centre Gives Clarity Over Privatization of Vizag Steel Plant After Union Minister of State For Steel Faggan Singh Comments,Centre Gives Clarity Over Privatization of Vizag,Privatization of Vizag Steel Plant,Union Minister of State For Steel Faggan Singh,Faggan Singh Comments,Mango News,Mango News Telugu,Centre to strengthen Vizag Steel,Centre Not in Hurry To Privatize Vizag Steel Plant,Centre Gives Clarity On Vizag Plant Privatisation,No Privatisation of RINL For Now,Vizag Steel Plant Latest News,Vizag Steel Plant Live News,Vizag Steel Plant Latest Updates

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్‌ పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్, ప్రస్తుతానికి ప్లాంటును ప్రైవేటీకరించే ఆలోచన లేదని, కర్మాగారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మరో ట్విస్ట్ ఇచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం.. ఆర్ఐఎన్ఎల్పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగలేదని, కేంద్ర ప్రభుత్వం మరియు కంపెనీ సహకారంతో ఉప సంహరణ ప్రక్రియ నడుస్తోందని వివరించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పనితీరును మెరుగుపర్చేందుకు కంపెనీ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఇక ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా రిపోర్టుల్లో నిజం లేదని స్పష్టం చేసింది. కాగా తాజా ప్రకటనతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాము వెనక్కి తగ్గలేదని కేంద్రం తేల్చి చెప్పినట్లయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 4 =