ఏపీలో పరిస్థితులపై తెలంగాణ నేతల వ్యాఖ్యలు వైసీపీ అసమర్ధ పాలనకు నిదర్శనం – టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Slams YCP Govt Over The Comments of Telangana Leaders Regarding Situations in AP,TDP Chief Chandrababu Slams YCP Govt,YCP Govt Over The Comments of Telangana Leaders,Chandrababu Slams Regarding Situations in AP,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy,TDP Chief Chandrababu Naidu,AP Politics,YSR Party,TDP Party,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,TDP Chief Chandrababu Latest News

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ నేతలు వ్యాఖ్యలు చేయడం, వైసీపీ అసమర్ధ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన 3 రోజుల ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం నూజువీడులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రం పరిస్థితి మెరుగ్గా ఉండేదని, అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేదని అన్నారు. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన మల్లవల్లి పారిశ్రామికవాడను పూర్తి చేసి ఉంటే, 50 వేల ఉద్యోగాలు వచ్చేవని, భోగాపురం విమానాశ్రయం, కడప స్టీల్‌ప్లాంట్‌కు తాము గతంలో భూమిపూజ చేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వాటిని పూర్తి చేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులపై పక్క రాష్ట్రాల వాళ్ళు చులకనగా మాట్లాడుతున్నారని, ఏపీలో రోడ్లు కూడా లేవని తెలంగాణ నేతలు ఎద్దేవా చేస్తున్నారని తెలిపారు. ఈ మాటలు వింటుంటే ప్రతిపక్షంలో ఉన్న తనకే బాధ కలుగుతోందని, అయితే అధికారంలో ఉన్నవారికి మాత్రం దీనిపై ఎలాంటి బాధ లేదని అన్నారు. తెలంగాణ నేతల వ్యాఖ్యలకు బదులుగా.. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఉంటే ధైర్యంగా ప్రజలముందు చెప్పాలని, అంతేకానీ రెండు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సహా ప్రస్తుత సీఎం కేసీఆర్.. ఇలా అందరూ దానిని కొనసాగించారని, అందుకు వారికి అభినందనలు అని పేర్కొన్నారు. అయితే ఇక్కడ సీఎం జగన్ మాత్రం అభివృద్ధి చేయకపోగా.. విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానిని నాశనం చేశారని, పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని, తమ హయాంలో కష్టపడి తీసుకొచ్చిన కంపెనీలను తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 1 =