రిషికొండ తవ్వకాలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు

Janasena Chief Pawan Kalyan Makes Satirical Tweet on Rishikonda Digs in Visakhapatnam,Janasena Chief Pawan Kalyan Makes Satirical Tweet,Rishikonda Digs in Visakhapatnam,Pawan Kalyan on Rishikonda Digs in Visakhapatnam,Mango News,Mango News Telugu,Pawan Kalyan posts satirical Tweet,Pawan Kalyan Political News,Janasena Chief Pawan Kalyan,Janasena Chief Pawan Kalyan Live News,Janasena Chief Pawan Kalyan Latest Updates,Visakhapatnam Latest News and Updates,Rishikonda Digs in Visakhapatnam News Today

విశాఖపట్నంలోని ప్రముఖ రిషికొండపై ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా దీనిపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇటీవలే కొత్తగా ప్రారంభించిన ‘జగనన్నే మా నమ్మకం’ కార్యక్రమంలో భాగంగా.. ఇళ్లకు సీఎం జగన్ స్టిక్కర్ అంటించడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇక వైసీపీ పాలనలో రాష్ట్రంలో చెట్లు, కొండలను నరికివేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం అనేది సర్వ సాధారణం అయిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. రిషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందని తెలిపిన ఆయన.. దీనిపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా? లేక రిషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అంటూ పవన్ ట్వీట్ చేశారు.

కాగా రిషికొండ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయంటూ విశాఖపట్నం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మరియు జనసేన నేత మూర్తి యాదవ్ గత ఏడాది అక్టోబర్‌లో వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా రిషికొండలో 9 ఎకరాల్లో మాత్రమే తవ్వకాలు జరపాలన్న నిబంధనలు ఉల్లంఘిస్తూ వైసీపీ ప్రభుత్వం దాదాపు 20 ఎకరాలు తవ్వేసిందని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి తవ్వకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఓ కమిటీని హైకోర్టు నియమించింది. దీంతో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర కమిటీ రిషికొండలో క్షేత్రస్థాయిలో పరిశీలించి, రెండు రోజుల క్రితం ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించింది. అయితే దీనిపై కౌంటర్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =