ఇసుక కొరతపై నవంబర్ 14న చంద్రబాబు దీక్ష

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Chandrababu Decides To Conduct One Day Protest Over Sand Crisis, Chandrababu Decides To Conduct One Day Protest Over Sand Crisis On November 14th, Chandrababu Naidu Decides To Conduct One Day Protest Over Sand Crisis, Mango News Telugu, One Day Protest Over Sand Crisis, Protest Over Sand Crisis In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా టీడీపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపధ్యంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇసుక కొరతపై ఒకరోజు దీక్ష చేయనున్నారు. నవంబర్‌ 14న విజయవాడలో దీక్ష చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించుకునట్టు టీడీపీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 14 ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నట్టు సమాచారం. నవంబర్ 5, మంగళవారం నాడు పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఇసుక వ్యవహారం, సిఎస్‌ బదిలీ, టీడీపీ కార్యకర్తలుపై దాడులు, రాష్ట్రంలో ఇతర పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబరు 3న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి తన గళాన్ని గట్టిగా వినిపించగా, బీజేపీ పార్టీ నాయకులు విజయవాడలో ఇసుక సత్యాగ్రహాన్ని నిర్వహించారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 5 =