50 శాతం రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt Issued Notification For Fifty Percent Reservation In Nominated Posts,Mango News,AP Breaking News Today,AP Govt Fifty Percent Reservation In Nominated Posts,AP Govt 50% Reservation,AP Nominated Posts,Andhra Pradesh Government Latest Notification

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో చర్చించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రిజర్వేషన్స్ అమలుకు విధి విధానాలు రూపొందించి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది. ప్రకటించిన 50 శాతం రిజర్వేషన్స్ లో బీసీ, మైనార్టీలకు 29 శాతం చొప్పున, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం పదవులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసారు. అదే విధంగా ఈ 50 శాతం రిజర్వేషన్స్ లో మహిళలకు 50 శాతం పదవులు కేటాయించారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్ని విభాగాలకు సంబంధించిన నామినేటెడ్ పదవుల్లో ఈ రిజర్వేషన్స్ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here