చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు: కేశినేని నాని

Chandrababu Is Not A Trustworthy Person Says Keshineni Nani, Chandrababu Is Not A Trustworthy Person, Not A Trustworthy Person Says Keshineni Nani, Kesineni Nani, Vijayawada, AP Politics, AP Elections, Chandrababu, Latest Keshineni Nani Comments, Keshineni Nani Comments On Chandrababu, Keshineni Nani Words About Chandrababu, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Kesineni nani, Vijayawada, AP Politics, AP Elections

బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు కేశినేని నాని. కొద్దిరోజులుగా బెజవాడలో రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నట్లుగానే ఆయన పార్టీ మారారు. టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయారు. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడే.. ఆ పార్టీ హైకమాండ్‌పై కేశినేని నాని పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై పలు సందర్భాల్లో ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక పార్టీ మారినప్పటి నుంచి వారిపై డోస్ పెంచేశారు. తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడుపై కేశినేని నాని విరుచుకుపడ్డారు.

చంద్రబాబు నాయుడు నమ్మదగిన వ్యక్తి కాదన్న కేశినేని నాని.. ఆయనలో ఉన్నది నటన అని విమర్శించారు. ముందు నుంచి కూడా తెలుగు దేశం పార్టీ నేతలకు తాను అదే చెపుతున్నానని.. చంద్రబాబును నమ్మితే నట్టెట్లే ముంచేస్తారని చెప్పానన్నారు. అటు దేవినేని అవినాష్‌కు తాను అదే చెప్పానన్న కేశినేని నాని.. చివరికి అదే జరిగిందని చెప్పుకొచ్చారు. దేవినేని అవినాష్‌ను చంద్రబాబు నట్టెట్లే ముంచేశారని వెల్లడించారు.

చంద్రబాబు నటన చేస్తే వైసీపీ అధినేత జగన్‌లో మాత్రం తనకు నిజాయితీ కనిపించిందని నాని తెలిపారు. జగన్ ముక్కుసూటిగా.. నిజాయతీగా వ్యవహరిస్తారని వివరించారు. అందుకే జగన్ అంటే తనకు ఇష్టమని.. ఈ కారణం వల్లే తాను వైసీపీలో చేరానని వివరించారు. టీడీపీ ప్రచారం చేస్తున్నట్లుగా.. విజయవాడలో వైసీపీ బలం ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. విజయవాడ ఎంపీ పరిధిలో వైసీపీ అత్యంత పటిష్టంగా ఉందని కేశినేని స్పష్టం చేశారు. విజయవాడలో వైసీపీకి 90 శాతం బలం ఉందని.. టీడీపీకి కేవలం 10 శాతం బలం మాత్రమే ఉందని నాని చెప్పుకొచ్చారు.

విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్ సభ నిర్వహిస్తే పెద్ద ఎత్తున ప్రజలు, క్యాడర్ వస్తారన్న నాని.. తెలుగు దేశం పార్టీ మీటింగ్ పెడితే పాతిక మంది కూడా సభకు రారని ఎద్దేవా చేశారు. ముచ్చటగా మూడోసారి తాను విజయవాడ నుంచి గెలిచి తీరుతానని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. అందులో ఎటువంటి మార్పు ఉండదన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + fifteen =