స్ట్రాంగెస్ట్ కరెన్సీ లిస్ట్ రిలీజ్

What Is The Rank Of Rupee, Strongest Currency, Strongest Currency List, Oil Deposits, Tax Free System, Foreign Currency Received Through Exchange, Supply Demand, Inflation, Domestic Economic Growth, Central Bank Policies, Financial Stability, India, India Currency News, Mango News, Mango News Telugu
Strongest Currency , Strongest Currency List, Oil deposits, tax-free system, Foreign currency received through exchange, Supply-Demand, Inflation, Domestic Economic Growth, Central Bank Policies, Financial Stability

ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ కరెన్సీల  లిస్టును తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసింది. అలాగే వాటికి ఎందుకంత ప్రాముఖ్యత వచ్చిందో దానికి గల కారణాలనుకూడా వివరించింది.ఇలా  ఈ జాబితాలో కువైటీ దినార్‌ తొలి స్థానంలో ఉంది. ఈ ఒక్క దినార్‌ విలువ భారత కరెన్సీలో రూ.270.23 కాగా 3.25 డాలర్లకు సమానం. బహ్రెయినీ దినార్‌  రూ.220.4 కాగా 2.65 డాలర్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత కరెన్సీ రూపాయి కాగా ఒక డాలర్‌=రూ.82.9తో  15వ స్థానంలో ఉంది. 2024 జనవరి 10 వ తేదికి ఉన్న విలువల ఆధారంగా లెక్కించిన ఫోర్బ్స్ ఈ జాబితాను సిద్ధం చేసింది.

టాప్ 10 కరెన్సీలు..

కువైటీ దినార్‌ – రూపాయలలో చూస్తే రూ. 270.23 కాగా డాలర్లలో చూస్తే  3.25 డాలర్లు

బహ్రెయినీ దినార్‌ -రూపాయలలో చూస్తే  రూ.220.4 కాగా డాలర్లలో చూస్తే 2.65 డాలర్లు

ఒమన్‌ రియాల్‌ -రూపాయలలో చూస్తే రూ.215.84 కాగా డాలర్లలో చూస్తే 2.60 డాలర్లు

జోర్డాన్‌ దినార్‌ – రూపాయలలో చూస్తే రూ.117.10 కాగా డాలర్లలో చూస్తే 1.141 డాలర్లు

జిబ్రాల్టర్‌ పౌండ్‌-  రూపాయలలో చూస్తే రూ.105.52 కాగా డాలర్లలో చూస్తే 1.27 డాలర్లు

బ్రిటిష్‌ పౌండ్‌-  రూపాయలలో చూస్తే రూ.105.54 కాగా డాలర్లలో చూస్తే 1.27 డాలర్లు

కేమన్‌ దీవుల- డాలర్‌ రూపాయలలో చూస్తే రూ.99.76 కాగా డాలర్లలో చూస్తే 1.20 డాలర్లు

స్విస్‌ ఫ్రాంక్‌ -రూపాయలలో చూస్తే రూ.97.54 కాగా డాలర్లలో చూస్తే 1.17 డాలర్లు

యూరో -రూపాయలలో చూస్తే రూ.90.80 కాగా డాలర్లలో చూస్తే 1.09 డాలర్లు

డాలర్- రూపాయలలో చూస్తే రూ.82.9

పోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో అమెరికా డాలర్‌ పదో స్థానంలో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి ఎక్కువగా వినియోగిస్తున్న కరెన్సీ.. అమెరికా డాలర్‌ అని ఫోర్బ్స్‌ తెలిపింది. ప్రాథమిక కరెన్సీ రిజర్వ్‌గానూ అమెరికా డాలర్ పైనే  మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంది. 1960లో ఫోర్బ్స్ జాబితాలో  అత్యంత బలమైన కరెన్సీల లిస్టును ప్రకటించినప్పటి  నుంచి కువైటీ దినార్‌ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీగా కొనసాగుతూ వస్తోంది. చమురు నిక్షేపాలు, ట్యాక్స్ ఫ్రీ సిస్టంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగడమే దీనికి కారణంగా ఫోర్బ్స్ పేర్కొంది. అలాగే  ప్రపంచంలో అత్యంత స్థిరమైన కరెన్సీగా స్విస్‌ ఫ్రాంక్‌ కొనసాగుతోందని  ఫోర్బ్స్‌ తెలిపింది.

ఒక యూనిట్‌తో కొనగల వస్తువులు, సేవల సంఖ్యతో పాటు ఎక్సేంజ్ ద్వారా వచ్చే ఫారెన్ కరెన్సీ మొత్తాన్ని మూల్యాంకనం చేసి ఈ కరెన్సీ విలువను నిర్ణయించినట్లు ఫోర్బ్స్‌ వివరించింది. ఒక కరెన్సీ ఇంపార్టెన్స్‌ను  నిర్ణయించడానికి సప్లై డిమాండ్, ద్రవ్యోల్బణం, దేశీయ ఆర్థిక వృద్ధి, సెంట్రల్ బ్యాంకుల విధానాలు, ఫైనాన్సియల్ స్టెబిలిటీ వంటి అంశాలన్నీ క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =