ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు

AP Political News 2019, Chandrababu Naidu about the drone incident, Chandrababu Naidu drone incident, Chandrababu Naidu Visits Flood Area In Vijayawada, Chandrababu Visits Flood Area, Chandrababu Visits Flood Area In AP, Chandrababu Visits Flood Area In Vijayawada, flood affected areas in Krishna district, heavy floods hit houses in Krishna and Guntur districts, Mango News, Mango News Telugu, President of the Telugu Desam Party, TDP President Naidu Visits Krishna District

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు కృష్ణా నది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపుకు గురైన గీతా నగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామా నగర్ లో పర్యటించి, బాధితుల ఎదురుకుంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తన ఇంటిని ముంచేందుకు ప్రయత్నం చేసిందని, అయితే తన ఇంటిని బదులు పేద ప్రజలు ఇళ్లను ముంచెత్తారని ఆరోపించారు. ముందుగా విమానంలో గన్నవరం చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నాయకులు స్వాగతం చెప్పారు, అక్కడినుంచి రోడ్డుమార్గాన విజయవాడ చేరుకొని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై విమర్శలు చేసారు. ఇవి సహజంగా వచ్చిన వరదలు కావని, ప్రాజెక్టుల నుండి నీటిని ముందే విడుదల చేసి ఉంటే ఇలాగా వరద వచ్చేది కాదని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవాలని కోరారు. అన్న క్యాంటీన్లు మూసివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. వరద బాధితులకు కనీసం భోజన సదుపాయాలు కూడ కల్పించడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టి, స్థానికంగా ఉండే ప్రజలందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here