తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Chief Justice of India Justice NV Ramana, Chief Justice of India Justice NV Ramana Visits Tirumala, Chief Justice of India Justice NV Ramana Visits Tirumala Temple, CJI NV Ramana visits Tirumala, CJI NV Ramana visits Tirumala temple, India Justice NV Ramana Visits Tirumala Temple, Justice NV Ramana Visits Tirumala, Justice NV Ramana Visits Tirumala Temple, Mango News, Tirumala temple, Tirumala Tirupati Devasthanam

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులకు టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో డా.జవహర్ రెడ్డి స్వాగతం పలుకగా, ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

తిరుమల పర్యటన సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వెంట ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఉండగా, ఈ కార్య క్రమంలో టీటీడీ అదనపు ఈవో ధర్మా రెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పలనాయుడు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + ten =