స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్, పలు కీలక ఆదేశాలు

CM Jagan Gives Key Orders During Spandana Video Conference with District Collectors Today, CM Jagan Gives Key Orders To Collectors, Spandana Video Conference, Jagan Meet With Collectors, Mango News, Mango News Telugu, AP CM Jagan Spandana Video Conference, CM Jagan Spandana Video Conference, AP CM Key Orders To Officials, Jagan Spandana Video Conference Live, CM Jagan Key Orders to Officials, AP CM YS Jagan Video Conference , Andhra Pradesh CM Jagan Reddy , Ys Jagan Reviews On Spandana Program

కలెక్టర్లకు కూడా మార్కులు కేటాయిస్తామని, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డిజి) ద్వారా వారి పనితీరుని అంచనా వేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లతో ‘స్పందన’ కార్యక్రమంపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా.. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించి సమీక్ష జరిపారు.

సీఎం జగన్ చేసిన కీలక సూచనలు..

  • ఎస్‌డిజి ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయి. ఎస్‌డిజి లక్ష్యాలే వారి పని తీరుకి ప్రామాణికం.
  • ఉపాధి హామీ కింద కనీస వేతనం రూ. 240 అందేలా చూడాలి.
  • కొత్తగా అర్హులైన లబ్దిదారులకు ఫేజ్-3 కింద డిసెంబర్ 21 నాటికి ఐదు లక్షల ఇళ్ళు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.
  • జగనన్న కాలనీల్లో 3. లక్షలు, 1.5 లక్షల టిడ్కొ ఇళ్ళు పూర్తి చేయాలి.
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం నిర్వహించిన తర్వాత నెల రోజుల్లోగా పనులు మొదలు కావాలని ఆదేశించారు.
  • అక్టోబర్ 25న ఈ-క్రాపింగ్ జాబితాలు అన్ని సచివాలయల్లో ప్రదర్శించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 13 =