ఏపీలో ఒక్కరోజే 13,72,481 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ, దేశంలోనే సరికొత్త రికార్డ్

AP Govt Creates New Record in Corona Vaccination Drive, AP Govt Creates New Record in Vaccination, AP Govt Creates New Record in Vaccination 1372481 Vaccine Doses Administered In Single Day, AP govt creates record, AP Vaccination Drive, Big vaccine Sunday, Corona Vaccination Drive, Corona Vaccination Programme, COVID 19 Vaccine, Covid Vaccination, Covid-19 Vaccination Drive, India Covid Vaccination, Mango News

రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా పటిష్టమైన చర్యలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా మరో సరికొత్త రికార్డు సృష్టించింది. జూన్ 20 ఆదివారం నాడు ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మందికి పైగా (13,72,481) కరోనా వ్యాక్సిన్ వేశారు. వీరిలో 12 ,85,394 మందికి మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ వేయగా, 87,087 మందికి రెండో డోసు కరోనా వ్యాక్సిన్ వేశారు.

గతంలో ఒకేరోజున 6 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన ఘనత దక్కించుకున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా ఆదివారం నాడు ఒక్కరోజే 13 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ వేసి జాతీయ స్థాయిలోనే కొత్త రికార్డును సృష్టించింది. ఈ డ్రైవ్ లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,67,494 మందికి వ్యాక్సిన్ వేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణి చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1.39 కోట్లు దాటింది.

ఏపీలో ఆదివారం చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వివరాలు (13,72,481):

  1. పశ్చమగోదావరి : 1,67,494 (పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ డోసులు)
  2. తూర్పుగోదావరి : 1,55,591
  3. కృష్ణా : 1,41,848
  4. విశాఖపట్నం : 1,11,893
  5. గుంటూరు : 1,06,795
  6. ప్రకాశం : 1,04,857
  7. చిత్తూరు : 1,03,011
  8. అనంతపురం : 89,293
  9. శ్రీకాకుళం : 88,564
  10. నెల్లూరు : 79,419
  11. కర్నూలు : 79,235
  12. కడప : 79,063
  13. విజయనగరం : 65,418
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =