మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టండి – సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ సలహా

CM Jagan Have To Put No-Confidence Motion Against Modi Government Advises APCC Chief Sailajanath CM Jagan Have To Put No-Confidence Motion Against Modi Government, APCC Chief Sailajanath Advises CM Jagan Have To Put No-Confidence Motion Against Modi Government, No-Confidence Motion Against Modi Government, Modi Government, Narendra Modi, Narendra Modi Government, Modi, Prime Minister of India, PM Modi, CM Jagan, AP CM YS Jagan, AP CM, AP CM YS Jagan Mohan Reddy, No-Confidence Motion, No-Confidence Motion Against PM Modi Government, APCC, Andhra Pradesh Congress Committee, Andhra Pradesh Congress Committee Chief Sailajanath, Mango News, Mango News Telugu, Andhra Pradesh Congress Committee Chief Sailajanath Advises AP CM YS Jagan, APCC Chief,

నరేంద్ర మోదీ సర్కార్‌పై సీఎం జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్‌ సలహా ఇచ్చారు. ఈరోజు (మంగళవారం) మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై కేంద్రం వైఖరిని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం ద్వంద్వ విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. విభజన జరిగి ఇన్నేళ్ళవుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా ఉన్నాయని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని శైలజానాథ్‌ తెలిపారు.

2019 ఎన్నికల సమయంలో తనని గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రాకి ప్రత్యేక హోదాతో పాటు అపరిష్కృత విభజన హామీలు నెరవేర్చుతామని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీని అనేక విధాలుగా మోసం చేస్తోందని.. దీనికి నిరసనగా నరేంద్ర మోదీ సర్కార్‌పై సీఎం జగన్ తన ఎంపీలతో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టించాలని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్‌ సలహా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 5 =