‘పంజాబ్‌ పాలిటిక్స్‌ టీవీ’పై నిషేధం విధించిన కేంద్రం

Central Govt Orders Blocking of Foreign-Based Punjab Politics TV’s Apps Website And Social Media Accounts, Central Govt Orders Blocking of Foreign-Based Punjab Politics, Foreign-Based Punjab Politics, Central Govt Orders, Central Govt, TV’s Apps Website And Social Media Accounts, TV’s Apps, Website, Social Media Accounts, Punjab Politics TV Apps, Punjab Politics Website, Punjab Politics Social Media Accounts, Politics of Punjab, Punjab Politics, Punjab Politics Latest News, Punjab Politics Latest Updates, Punjab Politics Live Updates, Mango News, Mango News Telugu,

అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో ప్రసారమవుతున్న ప్రముఖ టీవీ ఛానల్ ని నిషేదించింది. సిక్కు వేర్పాటువాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న ‘పంజాబ్‌ పాలిటిక్స్‌’ అనే టీవీపై కేంద్ర ప్రభుత‍్వం కేంద్రం కొరడా ఝుళిపించింది. చట్టవిరుద్ధంగా ప్రకటించబడిన సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న విదేశీ ఆధారిత ‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’ యాప్‌లు, వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించినట్లు I&B మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నిషేధించబడిన SFJ సంస్థతో ముడిపడి ఉందని.. ప్రస్తుతం పంజాబ్‌ లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని ప్రశాంత పరిస్థితిని ఇది  భంగపరిచేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది.

I&B మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. విదేశీ ఆధారిత ‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’ యొక్క యాప్‌లు, వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశిస్తున్నాం. దీనికి సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల చట్టం 1967 ప్రకారం చట్టవిరుద్ధంగా ప్రకటించబడింది. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించడానికి ఆన్‌లైన్ మీడియాను ఉపయోగించేందుకు ఛానెల్ ప్రయత్నిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించినందున ‘పంజాబ్ డిజిటల్ మీడియా’ వనరులను నిరోధించడానికి IT నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించి దీనిపై నిషేధం విధిస్తున్నాం” అని తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 11 =