పేదల సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వైఎస్సార్‌, ఆయన బిడ్డగా మరిన్ని మంచి పనులు చేస్తా – సీఎం జగన్‌

CM Jagan Inaugurates YSR and Ex-MLA Buchepalli Subba Reddy Statues at Chimakurthi Prakasam District, CM Jagan Inaugurates Ex-MLA Buchepalli Subba Reddy Statue at Chimakurthi Prakasam District, CM Jagan Inaugurates YSR Statue at Chimakurthi Prakasam District, Chimakurthi Prakasam District, Ex-MLA Buchepalli Subba Reddy Statue, YSR Statue, YSR and Buchepalli Subba Reddy idols, AP CM YS Jagan Mohan Reddy Trip To Chimakurthi Today, AP CM Chimakurthi Visit, AP CM YS Jagan Chimakurthi Visit News, AP CM YS Jagan Chimakurthi Visit Latest News And Updates, AP CM YS Jagan Chimakurthi Visit Live Updates, Mango News, Mango News Telugu,

పేదల సంక్షేమం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు వైఎస్సార్‌ అని, ఆయన బిడ్డగా మరిన్ని మంచి పనులు చేయడానికి తనకు అవకాశం లభించిందని, దీనిని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ బాటలో నడిచిన బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహం ఆవిష్కరించడం సంతోషంగా ఉందని, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ ఉంటుందని సీఎం జగన్‌ ప్రకటించారు.

ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌‌, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌, రైతుల సంక్షేమం.. ఇలా ఏ పథకం తీసుకున్నా అందులో వైఎస్సార్‌ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు ఎంతో మంచి చేశారని, ఆయన ఒక అడుగు వేస్తే.. వైఎస్సార్‌ బిడ్డగా తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని, మరిన్ని మంచి పనులు చేస్తానని అన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 95 శాతం మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నెరవేర్చామని, గడప గడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి తప్పకుండా మరోసారి అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక చీమకుర్తి ప్రధానంగా గ్రానైట్‌ పరిశ్రమలకు ప్రసిద్ధి అని, వారికి మేలు చేసేందుకు గ్రానైట్‌ పరిశ్రమకు కొత్త స్లాబ్‌ సిస్టమ్‌ తీసుకురాబోతున్నామని వెల్లడించారు. దీని ప్రకారం చిన్న గ్రానైట్‌ పరిశ్రమలకు కరెంట్‌ ఛార్జీల్లో రూ.2 తగ్గింపు ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 3 =