మీడియా రంగంలోకి ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ.. జాతీయ ఛానెల్ ఎన్డీటీవీలో 26% వాటా కొనుగోలుకు ప్రతిపాదన

Indian Billionaire Gautam Adani Makes Foray into News Channel Space Set To Acquire 29.18% Stake in NDTV, Indian Billionaire Gautam Adani Is Set To Acquire 29.18% Stake in NDTV, 29.18% Stake in NDTV, Indian Billionaire Gautam Adani, Billionaire Gautam Adani makes foray into news channel space, New Delhi Television Ltd, Gautam Adani seeks to control NDTV, Adani Set to purchase New Delhi Television Ltd, NDTV News Channel, Billionaire Gautam Adani News, Billionaire Gautam Adani Latest News And Updates, Billionaire Gautam Adani Live Updates, Mango News, Mango News Telugu,

భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్​ అదానీ తన వ్యాపార విస్తరణలో భాగంగా మీడియా రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ మేరకు ఆయన దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వార్తా ఛానెల్‌లలో ఒకటైన న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ) సంస్థలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నారు.ఈ క్రమంలో అదానీ గ్రూప్‌నకు చెందిన ఏఎమ్​ఎన్​ఎల్.. ఎన్డీటీవీ బ్రాడ్‌కాస్టర్‌లో రూ.493 కోట్లతో 26 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపింది. అదానీ గ్రూప్‌నకు చెందిన ‘విశ్వప్రధాన్ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ ఇప్పటికే ఎన్​డీటీవీ ప్రమోటర్ సంస్థ అయిన ‘ఆర్​ఆర్​పీఆర్​​ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’లో 29.18 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లలో రూ.366.20గా ఎన్​డీటీవీ షేర్‌ విలువ ఉండగా, సంస్థకు చెందిన 1,67, 62,530 షేర్లను ఒక్కోటి రూ.294 చొప్పున కొనుగోలు చేస్తామని అదానీ గ్రూప్‌ ప్రతిపాదించింది.

అదానీ గ్రూప్‌ మొదట బ్రాడ్‌కాస్టర్‌లో 29.18 శాతం వాటాను పరోక్షంగా కొనుగోలు చేయడంతో పాటు మరో 26 శాతం నియంత్రణను కొనుగోలు చేసే ప్రతిపాదన చేశారు. కాగా నిర్దిష్ట కంపెనీ 2008-09లో ఎన్డీటీవీకి రూ. 250 కోట్ల రుణం ఇవ్వగా, అదానీ గ్రూప్ సంస్థ ఇప్పుడు ఆ రుణాన్ని న్యూస్ ఛానెల్ కంపెనీలో 29.18 శాతం వాటాగా మార్చుకునే అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రణాళికలు వేస్తోంది. కాగా ప్రస్తుతం ఎన్​డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్‌రాయ్‌, రాధికా రాయ్‌ ప్రస్తుతం సంస్థలో 32.26 శాతం వాటాలు కలిగి ఉన్నారు. గత సంవత్సరం, గ్రూప్ యొక్క ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కింద ఉన్న మీడియా విభాగం అదానీ మీడియా వెంచర్స్ లిమిటెడ్, డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ని కొనుగోలు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =