‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ఫిర్యాదుల కోసం టోల్-ఫ్రీ నంబర్ 1902 ఏర్పాటు

CM Jagan Launches New Phone Program Jaganannaku Chebudam with Toll Free No 1902 in AP,CM Jagan Launches New Phone Program,New Phone Program Jaganannaku Chebudam,Jaganannaku Chebudam with Toll Free No 1902,Mango News,Mango News Telugu,CM Jagan To Launches Jaganannaku Chebudam,Jaganannaku Chebudam,YS Jagan starts Jaganannaku Chebudam,CM Jagan To Launch Jaganannaku Chebudam,Jaganannaku Chebudam Latest News And Updates,New Phone Program Jaganannaku Chebudam In AP,CM Jagan Latest News And Updates

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో దీనిని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇకపై రాష్ట్రంలోని ప్రజలు తమ సమస్యలకు సత్వర పరిష్కార మార్గం పొందుతారని, దీనికోసం టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1902 ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నంబర్‌కు డయల్ చేయడం ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చుని సూచించిన ఆయన.. వారి సమస్యలను సంబంధిత ప్రభుత్వ అధికారులు నిర్ణీత కాల వ్యవధిలో లోగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని వెల్లడించారు.

‘జగనన్నకు చెబుదాం’ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతస్థాయి వరకూ సమాచారం అందుతుందని, ఐవీఆర్ఎస్ ఎస్ఎంఎస్ ద్వారా సదరు ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవచ్చని సీఎం జగన్ చెప్పారు. వీటిపై మండల స్థాయి నుంచి సీఎంవో స్థాయి వరకు ఏర్పాటైన ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఈ ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్‌లను ట్రాక్ చేయడంతో పాటు ముఖ్యమంత్రి సందేశాన్ని నేరుగా ఫిర్యాదుదారులకు అందజేస్తాయని వెల్లడించారు. పౌరుల ఫిర్యాదులను ట్రాక్ చేయాలని, వాటిని పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న మరియు పరిష్కరించబడిన ఫిర్యాదులను ప్రతి వారం ఆడిట్ నిర్వహించాలని ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ప్రజలు తమ సమీప గ్రామ, వార్డు సచివాలయాన్ని కూడా సందర్శించవచ్చని, మధ్యాహ్నం 3 నుండి 5 గంటల మధ్య అక్కడ తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని సీఎం జగన్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + ten =