పింగ‌ళి వెంక‌య్య నిత్య స్మ‌ర‌ణీయులు, ఆయ‌న సేవ‌లను ఈ దేశం ఎప్ప‌టికీ మ‌రువ‌దు: సీఎం జగన్

birth anniversary of freedom fighter Pingali Venkayya, CM Jagan Pays Tribute to Pingali Venkayya, CM Jagan Pays Tribute to Pingali Venkayya on his Birth Anniversary, Mango News, Pingali Venkayya, Pingali Venkayya Birth Anniversary, Tribute to Pingali Venkayya on his Birth Anniversary, Tributes pour in for Pingali Venkayya, Tributes pour in for Pingali Venkayya on birth anniversary, Venkaiah pays tributes to Pingali Venkayya, Vice President pays tributes to Pingali Venkayya

భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. “భార‌త జాతీయ ప‌తాక రూప‌క‌ర్త‌గా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన పింగ‌ళి వెంక‌య్య నిత్య స్మ‌ర‌ణీయులు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధునిగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను ఈ దేశం ఎప్ప‌టికీ మ‌రువ‌దు. జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని స్మృతికి నివాళి” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

అలాగే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. “జాతిని సంఘటితం చేసే శక్తి జాతీయ పతాకానికే ఉందని నమ్మి, త్రికరణశుద్ధిగా మువ్వన్నెల పతాకం కోసం వారు చేసిన కృషి గురించి యువతరం తెలుసుకోవాలి. అధ్యయనం చేయాలి. సైనికుడిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, బహుభాషా కోవిదునిగా, వ్యవసాయ-ఖనిజ పరిశోధకునిగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసిన వెంకయ్య దేశభక్తి, కార్యదీక్ష, సృజనాత్మక ఆలోచనలు, నిరాడంబర జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =