ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు?

Something Special Is Prakasam Politics, Prakasam Political News, Prakasam Politics,CM Jagan, YCP, Janasena, Pawan Kalyan, Chandrababu, BJP, Congress,Magunta Srinivasula Reddy, Magunta Raghavar Reddy, Amanchi Krishna Mohan, Political News, Mango News, Mango News Telugu
Prakasam Politics,CM Jagan, YCP, Janasena, Pawan Kalyan, Chandrababu, BJP, Congress,Magunta Srinivasula Reddy, Magunta Raghavar Reddy, Amanchi Krishna Mohan

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రకాశం జిల్లాలోని దర్శిపైనే  అందరి చూపు  ఉంటుంది. సిట్టింగ్​ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్​‌ను వైఎస్సార్సీపీ అధిష్టానం పక్కన పెట్టడంతో… వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్​ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి ఈ సారి బరిలో నిలిచారు.  తెలుగుదేశం పార్టీ  నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. జనసేనకు దర్శి టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగినా.. ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి తెలుగు దేశం పార్టీలో చేరి.. దర్శి నుంచి పోటీ చేయడానికి  సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బెంగళూరు నుంచి హైదరాబాద్​ చేరుకున్న ఆయన దీనిపై తన సన్నిహితులతో కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. మద్దిశెట్టి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మాత్రం దర్శి రాజకీయం రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరో వైపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి , తన కొడుకు రాఘవరెడ్డితో కలిసి జనసేన అధినేత  పవన్​ కళ్యాణ్‌తో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలిసి చర్చించారు. వీళ్లిద్దరూ దేని గురించి పవన్‌ను  కలిశారనేది జిల్లాలో హాట్​ టాపిక్​ అయింది. మాగుంట  రాఘవరెడ్డి ఈ సారి ఎన్నికలలో పోటీకి దిగాలని భావించారు. వైఎస్సార్సీపీ అతనికి  టికెట్​ ఇవ్వడానికే నిరాకరించడంతో.. మాగుంట టీడీపీలో చేరారు.అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రాఘవరెడ్డికి బదులు శ్రీనివాసులు రెడ్డినే అక్కడ  పోటీ చేయమని కోరిందట.

ఎందుకంటే ఢిల్లీ లిక్కర్​ కేసులో మాగుంట రాఘవరెడ్డి నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో రాఘవరెడ్డి అప్రూవర్​‌గా  మారడంతో.. ఈడీ మళ్లీ పిలిచే అవకాశం ఉంటుంది. అందుకే తెలుగుదేశం పార్టీ అధిష్టానం  ఇప్పటి వరకూ మాగుంటకు సీటును ఖరారు చేయలేదని తెలుస్తోంది. అందువల్లే జనసేనాని ద్వారా రాఘవరెడ్డికి  ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమోనన్న ఆశతో పవన్​‌ను కలిసి ఉండొచ్చనే చర్చ  ఇప్పుడు జరుగుతోంది. ఇటు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్పార్సీపీని ఢీకొట్టడానికి  జనసేనాని సహకారం కోరడానికే కలిసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

మరోవైపు ఉమ్మడి జిల్లాలోని చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ​ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్​ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది.  వైఎస్సార్సీపీ ఆయనకు టికెట్​ నిరాకరించి గాల్లో పెట్టడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు కూడా  జనసేన నుంచి గిద్దలూరు సీటు కోసం ప్రయత్నించి భంగపడ్డారు. దీంతో  కృష్ణమోహన్​ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ముందుగా భావించారు. అయితే ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయింది కాంగ్రెస్​ పార్టీ నుంచే కాబట్టి..మళ్లీ కాంగ్రెస్​ పార్టీ నుంచే పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − one =