కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

Controversial Farmers Bills, Farm Bills, Farmers Bills, Farmers Bills 2020, President Approves Controversial Farmers Bills Amid Protest, President Ram Nath Kovind, Protest Against Farmers Bills, Ram Nath Kovind, Ram Nath Kovind Approves Controversial Farmers Bills

ఇటీవలే లోక్ సభ, రాజ్యసభలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27, ఆదివారం నాడు పార్లమెంట్‌ ఆమోదించిన ఈ మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్లు-2020, ద ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ బిల్లు-2020, ద ఎసన్షియల్‌ కమోడిటీస్‌ (సవరణ) బిల్లు-2020 లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మరోవైపు ఈ వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో రైతులు మరియు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం విశేషం. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఈ బిల్లులు చట్ట రూపం దాల్చి అమల్లోకి రానున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =