కుప్పంలో వైఎస్సార్సీపీ ఘన విజయం, మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌

Andhra Pradesh, AP Municipal Election Results, AP Municipal Election Results 2021, CM YS Jagan Appreciated Minister Peddireddy, CM YS Jagan Appreciated Minister Peddireddy in the View of Party’s Victory in Kuppam Municipality, Mango News, Nellore, Nellore Corporation, Nellore Municipal Corporation votes counting, Nellore Municipal Elections, Polls for Nellore corporation, YCP Party’s Victory in Kuppam Municipality, YSRCP Registers Victory in Kuppam, YSRCP Registers Victory in Kuppam Municipality Elections, YSRCP Victory in Kuppam Municipality Elections, YSRCP Won in Kuppam Municipality Elections

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా, ఒకటి ఏకగ్రీవం కాగా 24 స్థానాల్లో నవంబర్ 15న పోలింగ్‌ జరిగింది. 24 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు బుధవారం జరగగా, 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ కేవలం 6 వార్డులే గెలుచుకోగలిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. టీడీపీకి ఎంతో కాలంగా కంచుకోటగా ఉంటున్న కుప్పంలో ఈసారి వైఎస్సార్సీపీ పూర్తిస్థాయిలో పట్టు సాధించింది.

తాజా ఫలితాలు అనంతరం చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ కీలకనేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుప్పం మున్సిపల్‌ ఎన్నికలో ఘన విజయం సాధించినందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, జిల్లా పార్టీ నేతలను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − one =