ఏపీలో ఈఏపీ సెట్-2021 షెడ్యూల్ విడుదల, జూన్ 24 నోటిఫికేషన్

Adimulapu Suresh Announced EAPCET-2021 Schedule, AP EAMCET 2021 Exam Dates, AP EAMCET 2021 Latest News, AP EAMCET 2021 Schedule, AP EAMCET 2021 Schedule Released, AP Education Minister, AP Education Minister Adimulapu Suresh, AP Education Minister Adimulapu Suresh Announced EAPCET, AP Education Minister Adimulapu Suresh Announced EAPCET-2021 Schedule, AP Education Minister releases 2021 AP EAMCET schedule, Eamcet Schedule, EAPCET 2021, EAPCET-2021 Schedule, Education minister Adimulapu Suresh, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021 (ఈఏపీ సెట్) షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం నాడు ప్రకటించారు. ఇప్పటివరకు ఎంసెట్ గా పిలవబడిన ఈ ప్రవేశ పరీక్షను, మెడికల్ కోర్సుకు సంబంధించిన పరీక్ష నీట్ పరిధిలోకి వెళ్లిన దృష్ట్యా ఇకపై ఈఏపీ సెట్ గా పిలువబడుతుందని చెప్పారు. ఈఏపీ సెట్-2021 నోటిఫికేషన్ ను జూన్ 24 విడుదల చేస్తామని చెప్పారు.

ఇందుకోసం ఆన్‌లైన్ దరఖాస్తులను జూన్ 26 నుంచి జూలై 25 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూలై 26 నుంచి ఆగస్టు 5 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో ఆగస్టు 11 నుంచి ఆగస్టు 15 వరకు, రూ.10000 ఆలస్య రుసుముతో ఆగస్టు 16 నుంచి ఆగస్టు 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. ఇక ఆగస్టు 19 నుంచి 25 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో ఈఏపీ సెట్-2021 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here