కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ ఆరా, విచారణకు ఆదేశాలు

CM YS Jagan Inquires about Fire Accident at Vijayawada Covid Care Center

విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్‌ను లీజుకు తీసుకుందని, అందులో కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లను పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here