దేశంలో పలు రాష్ట్రాలకు మన పాలన ఆదర్శం, ఏపీలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సమీక్షలో సీఎం జగన్‌

CM YS Jagan Mohan Reddy Held Review Meet on Sustainable Development Goals in Andhra Pradesh, AP CM YS Jagan Mohan Reddy Held Review Meet on Sustainable Development Goals in Andhra Pradesh, YS Jagan Mohan Reddy Held Review Meet on Sustainable Development Goals in Andhra Pradesh, AP CM YS Jagan Held Review Meet on Sustainable Development Goals in Andhra Pradesh, Review Meet on Sustainable Development Goals in Andhra Pradesh, Sustainable Development Goals in Andhra Pradesh, AP Sustainable Development Goals, Sustainable Development Goals, Review Meet on AP Sustainable Development Goals, AP Sustainable Development Goals News, AP Sustainable Development Goals Latest News, AP Sustainable Development Goals Latest Updates, AP Sustainable Development Goals Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

దేశంలో పలు రాష్ట్రాలకు మన పాలన ఆదర్శం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. దేశంలోని ఇతర రాష్ట్రాలు అమలు చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఈ విషయంలో దేశంలో పలు రాష్ట్రాలకు మన పాలన ఆదర్శమని పేర్కొన్నారు. ఈ మూడేళ్ళలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సుమారు ఒక లక్షా 65 వేల కోట్లు జమ చేశామని గుర్తు చేశారు.

ఇక వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిపాలనలో అనేక అంశాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ప్రజలకు ఉపయోగపడేలా అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్‌ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో 3 వేల రకాల చికిత్సలు చేర్చామని, ఇది దేశంలో మరెక్కడా లేదని స్పష్టం చేశారు. అలాగే అమ్మ ఒడి, విద్య దీవెన పథకాల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆయన ప్రకటించారు. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు అన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పథకాలు అందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని వివరించాలని సీఎం జగన్ అధికారులను కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 18 =