ఆయుర్వేద మందుపై సీఎం జగన్ కీలక నిర్ణయం, శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆదేశాలు

CM YS Jagan Orders Officials to Conduct Scientific Study on Krishnapatnam Ayurvedic Medicine,Mango News,Mango News Telugu,YS Jagan orders scientific study on Ayurvedic medicine,Ayurvedic Medicine Touted As Miracle Cure For Covid In AP,Ayurvedic Medicine,Ayurvedic Medicine News,Ayurvedic Medicine Latest Updates,Ayurvedic Medicine In AP,AP Ayurvedic Medicine,Krishnapatnam Ayurvedic Medicine,Krishnapatnam Ayurvedic Medicine Live Updates,Krishnapatnam Ayurvedic Medicine News,CM YS Jagan Orders Officials,CM YS Jagan,CM YS Jagan Live,CM YS Jagan Live Updates,CM YS Jagan Pressmeet,CM YS Jagan Latest News,CM YS Jagan News,AP CM YS Jagan Key Decision On Nellore Ayurvedic Medicine,Nellore Ayurvedic Medicine,Ayurvedic Medicine For COVID-19

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోనిగి ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఆయుర్వేద మందుపై అధికారులతో చర్చించి సీఎం వైఎస్ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆయుర్వేదం మందుపై సంబంధిత విభాగాలతో శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందాన్ని, వైద్యులను పంపాలని చెప్పారు. ఈ ఆయుర్వేద మందుపై పూర్తిస్థాయిలో శాస్త్రీయ నిర్ధారణ, పనిచేసే తీరుపై అధ్యయనం చేయించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ కెపాసిటీకి తగ్గట్టుగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రుల్లో నిర్ణీత ప్రమాణాలు పాటించాలన్నారు. అలాగే రోగులకు మంచి ఆహారం,ఆస్పత్రుల్లో పారిశుధ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని అధికారులను సూచించారు. అధిక ఫీజుల వసూళ్లు, రెమిడెసివర్ ఇంజక్షన్ల పేరుతో అక్రమాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + nine =