ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి అంత్యక్రియలకు హాజరైన సీఎం జగన్, పార్థివదేహానికి నివాళులు

CM YS Jagan Pays Homage To YSRCP MLC Challa Bhagiratha Reddy at Avuku Today, Homage To YSRCP MLC Challa Bhagiratha Reddy at Avuku Today, YSRCP MLC Challa Bhagiratha Reddy Passes Away, Challa Bhagiratha Reddy Passed Away, CM YS Jagan Pays Homage To Challa Bhagiratha Reddy, MLC Challa Bhagiratha Reddy, AP CM YS Jagan Mohan Reddy, Demise of YSRCP MLC Challa Bhagiratha Reddy, MLC Challa Bhagiratha Reddy Is No More, RIP YSRCP MLC Challa Bhagiratha Reddy, CM YS Jagan Pays Homage, YSRCP MLC Challa Bhagiratha Reddy News, YSRCP MLC Challa Bhagiratha Reddy Latest News And Updates, YSRCP MLC Challa Bhagiratha Reddy Live Updates, Mango News, Mango News Telugu

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యుడు చల్లా భగీరథ రెడ్డి బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నంద్యాల జిల్లా అవుకులో ఆయన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈరోజు సాయంత్రం చల్లా నివాసానికి చేరుకున్న సీఎం జగన్ ముందుగా ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. భగీరథ రెడ్డి సతీమణి శ్రీ లక్ష్మికి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని తెలిపారు.

కాగా ప్రస్తుతం చల్లా శ్రీ లక్ష్మి  వైఎస్సార్‌సీపీ తరపున అవుకు జడ్పిటీసీగా ఉన్నారు. ఇక చల్లా భగీరథ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఏడాది జనవరిలో ఎమ్మెల్సీగా ఉంటూ భగీరథ రెడ్డి తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందగా, ఆయన స్థానంలో ఎమ్మెల్యే కోటా కింద భగీరథ రెడ్డికి సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే భగీరథ రెడ్డి గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధ పడుతూ పరిస్థితి విషమించి హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా ముఖ్యమంత్రి వెంట స్థానిక జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు పలువురు భగీరథ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =