సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

CM KCR Expressed Condolences on the Demise of Senior Journalist Kancharla Lakshmareddy, Demise of Senior Journalist Kancharla Lakshmareddy, CM KCR Expressed Condolences on the Demise of Kancharla Lakshmareddy, Senior Journalist Kancharla Lakshmareddy, Kancharla Lakshmareddy, Telangana CM KCR, Journalist Kancharla Lakshmareddy Passes Away, Kancharla Lakshmareddy Passed Away, Journalist Kancharla Lakshmareddy Is No More, RIP Journalist Kancharla Lakshmareddy, KL Reddy passed away, Journalist Kancharla Lakshmareddy News, Journalist Kancharla Lakshmareddy Latest News And Updates, Journalist Kancharla Lakshmareddy Live Updates, Mango News, Mango News Telugu

సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి (కె.ఎల్.రెడ్డి) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కె.ఎల్.రెడ్డి జర్నలిస్టుగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, పత్రికా రంగానికి అందించిన నిస్వార్థ సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కె.ఎల్.రెడ్డి కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కె.ఎల్‌.రెడ్డి గురువారం తెల్లవారుజామున వరంగల్ లో కన్నుమూశారు. కె.ఎల్‌.రెడ్డి తన సుదీర్ఘ జర్నలిజం కెరీర్ లో ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ సహా పలు పత్రికల్లో పని చేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక అంశాలపై ఆయన రచనలు చేశారు. 2016లో కె.ఎల్‌.రెడ్డి గురించి ఒక పత్రికలో వచ్చిన వార్తను చూసి, సీఎం కేసీఆర్ ఆయనను కార్యాలయానికి ఆహ్వానించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యం, ఇతర ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కె.ఎల్‌.రెడ్డికి రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. మరోవైపు కె.ఎల్.రెడ్డి మృతి పట్ల పలువురు సంపాదకులు, జర్నలిస్టులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − eight =