దిశ యాప్‌ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్

Andhra CM to attend promotional event to spread awareness, AP CM to attend Disha App awareness programme, CM Jagan to promote Disha App, CM steps in to promote Disha App for women, CM YS Jagan, CM YS Jagan to Participate in Disha APP Awareness, CM YS Jagan to Participate in Disha APP Awareness Program, CM YS Jagan to Participate in Disha APP Awareness Program Tomorrow at Gollapudi, Disha APP Awareness Program, Disha APP Awareness Program at Gollapudi, Mango News, YS Jagan to visit Gollapudi on June 29

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూన్ 29, మంగళవారం నాడు గొల్లపూడిలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘దిశ యాప్‌’ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే లక్షల మంది దిశ యాప్‌ ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. కాగా ఈ యాప్ ను రాష్ట్రంలో ప్రతి మహిళా డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రభుత్వం కార్యచరణ చేపడుతుంది. ఈ క్రమంలో ఈ దిశా యాప్ వినియోగంపై మహిళలు, విద్యార్థినులు, యువతులకు మరింత అవగాహన, చైతన్యం కల్పించేందుకు మంగళవారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ రూరల్‌ గొల్లపూడి గ్రామంలో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరై దిశ యాప్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. సీఎం వైఎస్ జగన్‌ గొల్లపూడి పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − two =