ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 67,716 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,501 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 315, నెల్లూరులో 242, చిత్తూరులో 174, పశ్చిమగోదావరిలో 150, కృష్ణాలో 147, గుంటూరులో 141 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,98,603 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 10 మరణాలు చోటుచేసుకున్నాయి. కృష్ణాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13696 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,697 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,69,169 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,738 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ