జగన్ ఆఫర్‌కు రాధా లొంగిపోయారా?

Did Radha Surrender to Jagans Offer,Did Radha Surrender,Surrender to Jagans Offer,Vangaveeti Radha, Vangaveeti to YCPs nest again, Radha surrender to Jagans offer,YCP, TDP, Jana Sena,Mango News,Mango News Telugu,YSR Party,TDP Party,JSP Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Vangaveeti Radha Latest News,Vangaveeti Radha Live Updates
Vangaveeti Radha, Vangaveeti to YCP's nest again?, Radha surrender to Jagan's offer?YCP, TDP, Jana Sena

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో..ఎక్కువగా కాపు సామాజిక వర్గం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. పవన్ ద్వారా కాపులు టీడీపీ, జనసేన వైపు టర్న్ అవడంతో జగన్ అలర్ట్ అయ్యారు. అంబటి రాయుడితో చెక్ పెట్టాలనుకుంటే అతను వారం రోజుల్లో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన జెండా ఎత్తారు. పోనీ ముద్రగడను లాక్కుందామంటే ముద్రగడ పద్మనాభం కూడా టీడీపీ, జనసేన తప్ప వైసీపీలోకి రానంటే రానుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో  సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పడటానికి వంగవీటి రాధాకృష్ణ తప్ప జగన్‌కు దిక్కులేకుండా పోయింది. దీంతో  వైసీపీలోకి రాధాను రప్పించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టేశారట. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కూడా  వంగవీటి రాధాకృష్ణ జగన్ వెంటే నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసిన  రాధాకృష్ణ ఓటమి పాలయ్యారు. దీంతో 2019  ఎన్నికల్లో  వంగవీటి రాధా కోరుకున్న సీటు ఇవ్వలేదు.

వైసీపతో కోపంతో రాధా అప్పుడు  తెలుగుదేశం పార్టీలో చేరి. పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అప్పుడు కూడా టీడీపీ గెలవలేదు. అప్పటినుంచి అదే పార్టీలో కొనసాగుతున్న రాధా.. యాక్టివ్ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటూనే వస్తున్నారు.అయితే ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణలతో జనసేనలోకి వెళ్లడానికి రాధా మొగ్గు చూపుతున్నారన్న వార్తలు వినిపించాయి.

అయితే మరోవైపు రాధాకృష్ణతో కాపుల ఓట్లకు గేలం వేయడానికి  వైసీపీ సీనియర్లు రాధాకృష్ణకి టచ్ లోకి వెళ్లారట. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ రాధాని వైసీపీలోకి రావాలని గతంలోనే ఆహ్వానించారట.  కానీ తప్పుడు నిర్ణయాలతో పొలిటికల్ గా తప్పటడుగులు వేయడం, అంచనాలు తప్పడంతో 2009 నుంచి పవర్ పాలిటిక్స్ కు రాధాకృష్ణ దూరంగా ఉన్నారు.

వైసీపీలోకి వస్తే  నాలుగో జాబితాలో రాధాకు ఎంపీ స్థానాన్ని కేటాయిస్తామని ఏపీ సీఎం జగన్.. రాధాకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.  అయితే వైసీపీ ఆఫర్‌కు, జనసేన ఆహ్వానానికి ఇంకా రాధా ఓకే చెప్పలేదట. ఇటు  వైసీపీ నేతలు మాత్రం తమ ప్రయత్నాలు వీడడం లేదు. దీంతో రాధా మళ్లీ వైసీపీకి వెళతారా అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి అయినా రాధా సరైన నిర్ణయం తీసుకుని అధికారాన్ని దక్కించుకుంటారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =