సామాన్యులకు భారంగా మారుతోన్న వంటింటి ఖర్చు

Cost of Kitchen Becoming a Burden For The Common Man,Cost of Kitchen Becoming a Burden,Cost of Kitchen Burden For The Common Man,Cost of Kitchen,The Common Man Burden,Mango News,Mango News Telugu,Burden For The Common Man,Cost of Kitchen Latest News,Cost of Kitchen Latest Updates,Cost of Kitchen Live News,The Common Man News Today,Minimum requirement prices,Increased prices,Minimum requirement prices, Increased prices,Rice prices, Prices of pulses, rice, sugar, jaggery, wheat flour and other staples,Common Man Burden Latest News,Common Man Burden Latest Updates,Rising prices of essentials,Tomatoes Out of Commoners,Kitchen Cost Burden News Today

ఒకప్పుడు రూ. 20 వేల జీతం వస్తే దర్జాగా బతికే సామాన్యులు.. ఇప్పుడు పెరిగిన ధరల(Increased prices)తో పెరగని జీతాల (Non-increasing salaries) అల్లాడిపోతున్నారు. ఏం ముట్టుకుందామన్నా ధరల షాక్ కొట్టడంతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పప్పు , ఉప్పు అనే కాదు.. కూరగాయల నుంచి వంట గ్యాస్ వరకూ ధరలు మండిపోయి సామాన్యుడి బతుకునే ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఏ రోజు ఏ కూరగాయ రేటు పెరుగుతుందో.. ఏ పూట వంట గ్యాస్ క్యాస్ట్ పెరుగుతుందోనని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు సామాన్యులు.

నిజానికి ఇది రేటు పెరిగింది అది పెరగలేదు అన్న మాట లేకుండా అన్ని రకాల కనీస అవసరాల ధరలు (Minimum requirement prices) ఆకాశాన్నంటుతున్నాయి. అందరికీ కూరగాయలంటే ఠక్కున గుర్తొచ్చే టమోటా(Tomato).. కేజీ రూ. 140 కి చేరి ఠారెత్తిస్తోంది. నేనేం తక్కువా అన్నట్లు పచ్చి మిర్చి అంతకు మించిపోయి రూ. 160 లు పలుకుతోంది. కందిపప్పు కిలో కొనాలంటే 150కి పైమాటే. బియ్యం ధరలు (Rice prices) ఎప్పుడో బరువెక్కాయి. ఇక వంటగ్యాస్‌ అయితే వెలిగించకముందే మండిపోతోంది. నిత్యావసరాల ధరలు నానాటికీ పెరుగుతుండటంతో.. పేద, మధ్యతరగతి వర్గాల వంటింటి బడ్జెట్‌ రాకెట్‌లా దూసుకెళ్లే పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. .

ఒకప్పుడు కిలో లెక్కన కూరగాయలు కొనేవాళ్లంతా.. ఇప్పుడు కిలోల లెక్కన కూరలు కొనడం కష్టమే అనేటట్టుగా పరిస్థితులు మారిపోయాయి. గతంలో రూ. 200, 300 తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు కిలో టమోట మాత్రమే కొని మిగిలిన చిల్లర తీసుకుని ఇంటి దారి పట్టే పరిస్థితికి వచ్చాం. వర్షాలు లేక.. ఉత్పత్తి తగ్గిపోవడంతో టమోటా ధర పెరుగుతూ వస్తూ కిలో రూ. 140 కూడా క్రాస్ అయిపోతుంది. పచ్చిమిర్చి ధర కూడా వారం రోజుల్లో 80కి పైగా పెరిగి.. ప్రస్తుతం కిలో 160కి పైనే పలుకుతోంది. హైదరాబాద్‌లోని కొన్ని మాల్స్, ఆన్‌లైన్‌లో కిలో పచ్చి మిర్చి (green chillies online) రూ. 280 చూపిస్తుండటంతో కొనేవాళ్లు ఆవైపే తొంగిచూడటం మానేసారు. అటు ఫిబ్రవరిలో కిలో 60 నుంచి 70 మధ్య ఉన్న అల్లం.. మార్చి నెలాఖరుకు రూ. 100కు పైగా చేరి.. ఇప్పుడు ఏకంగా రూ. 250 వరకు వచ్చింది. వెల్లుల్లి రేటు 20శాతం వరకు పెరిగింది. కారంపొడి అయితే ఏకంగా 150 శాతం నుంచి 200శాతం వరకు పెరిగిపోయింది. పచ్చళ్లకు ఉపయోగించే కారమైతే మరింత ఘాటెక్కింది.

పప్పులు (Prices of pulses), బియ్యం, పంచదార (rice, sugar) బెల్లం, గోధుమ పిండి (jaggery, wheat) ఇతర రవ్వలు ధరలు కూడా 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగిపోయాయి. అటు టీ, కాఫీ పొడుల ధరలు కూడా కిలోకు 150 వరకు పెరిగిపోయాయి. చివరకు చికెన్ ధర ఈ మధ్య కిలో 320కి చేరి నాన్ వెజ్ లవర్స్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు కాస్త తగ్గినా కోడిగుడ్డు మాత్రం రూ.6, రూ 7 వరకూ చేరింది. అలాగే ప్రతి ఇంటికి అవసరం అయ్యే గ్యాస్ సిలిండర్‌ ధర నాలుగేళ్ల కిందట 541 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 11వందలు క్రాస్ అయిపోయింది. ఇలా నాలుగేళ్ల కిందటితో పోలిస్తే పప్పుల ధరలు కూడా 30 – 70 శాతం వరకు పెరిగాయి.. కరోనా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్ల మండిన నూనెల ధరలు తర్వాత దిగొచ్చినా ఇంకా సలసల మరుగుతూనే ఉన్నాయి. ఇలా మొత్తంగా చూస్తే మాత్రం నాలుగేళ్లలో సామాన్యుల వంటింటి బడ్జెట్‌ 60శాతం పెరిగింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 19 =