వందే భారత్ స్థానంలో వందే సాధారణ్ ట్రైన్..

Indian Railways To Soon Launch Budget Friendly Non AC Vande Ordinary Trains,Indian Railways To Soon Launch Budget,Budget Friendly Non AC Trains,Non AC Vande Ordinary Trains,Indian Railways To Soon Launch Ordinary Trains,Mango News,Mango News Telugu,Non-AC Vande Ordinary,Chennai ICF,First vande simple train,AC vande sim train, Bio-vacuum toilet,IRCTC Latest News,Non-AC Vande Sadharan train,Vande Bharat Express,Indian Railways,Vande Sadharan to comfort passengers,Indian Railways Latest News,Indian Railways Latest Updates,Indian Railways Live News,Vande Ordinary Trains Latest News,Vande Ordinary Trains Latest Updates

ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇండియన్ రైల్వే (Indian Railway) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన జర్నీ అనుభూతిని అందించడంతో పాటు, మెరుగైన సర్వీసులను అందించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందన్న విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకుంది. తాజాగా సాధారణ ప్రయాణికుల కోసం.. వారికి తక్కువ డబ్బులతోనే మెరుగైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని (Better comfortable travel) అందించడానికి నాన్-ఏసీ వందే ఆర్డినరీ (Non-AC Vande Ordinary) ట్రైన్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ సెమీ-హై స్పీడ్ రైలు వందే భారత్‌ను రైల్వే దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు నడుపుతోంది.

ఈ నాన్-ఏసీ వందే సాధారణ్ రైళ్లను రూ.65 కోట్ల అంచనా ఖర్చుతో చెన్నై ఐసీఎఫ్‌ (Chennai ICF)లో తయారు చేయనున్నారట. దీనిలో భాగంగా ఫస్ట్ ట్రైన్ ఈ ఏడాది చివరి నాటికి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ ఏడాది చివరి నాటికి తొలి వందే సాధారణ్ ట్రైన్ (First vande simple train) వచ్చే అవకాశం ఉందని ఇండియన్ రైల్వే తెలిపింది. చైర్ కార్ సౌకర్యంతో కూడిన AC వందే సాధారణ్ ట్రైన్ (AC vande sim train) ICF చెన్నైలో తయారవుతోంది. ఈ ట్రైన్‌ను 23 రూట్లలో విజయవంతంగా నడిపించడానికి ఆలోచిస్తున్నారు. వందే సాధారణ్ ట్రైన్‌ను సిద్ధం చేయడానికి దాదాపు రూ.100 కోట్లు ఖర్చవుతుంది. వందే సాధారణ్ రైలులో మొత్తం 24 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, రెండు లోకోమోటివ్‌లు ఉంటాయని తెలుస్తోంది.

వందే సాధారణ్ రైలులో ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాన్నిఅందించాలని చూస్తున్నారు. బయో-వాక్యూమ్ టాయిలెట్ (Bio-vacuum toilet), ఛార్జింగ్ పాయింట్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి సౌకర్యాలు రైలులో అందుబాటులో ఉంటాయట. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి కోచ్‌లో CCTV కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వందే ఆర్డినరీ రైలు కూడా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లాగే ఆటోమేటిక్ డోర్ సిస్టమ్‌తో అమర్చుతారు. నిజానికి రైళ్లలో సీసీటీవీ కెమెరాలు, బయో-వాక్యూమ్ టాయిలెట్లు, ఆటోమేటిక్ డోర్ సిస్టమ్స్ వంటి ఇలాంటి ఎన్నో సౌకర్యాలను కల్పించాలని రైల్వే శాఖ ఆలోచించడం ఇదే తొలిసారి.

వందే భారత్ రైళ్ల ఛార్జీల విషయంలో చాలామందికి అసంతృప్తి ఉంది. అది సామాన్యులకు అందుబాటులో ఉండే ట్రైన్ కాదంటూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఇప్పుడు ప్రారంభించే వందే సాధారణ్ ట్రైన్ ‌లో సాధారణ ఛార్జీలు ఉంటాయని చెప్పడంతో ఇది తమకు ఎంత వరకూ రీజనబుల్‌గా ఉంటుందో చూడాలని అనుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 15 =