ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య తుదిశ్వాస

Ex-Tamil Nadu Governor Rosaiah Passes Away At 88, Former Andhra Pradesh chief minister K Rosaiah passes away, Former Andhra Pradesh CM Konijeti Rosaiah, Former Andhra Pradesh CM Konijeti Rosaiah dies, Former Andhra Pradesh CM Konijeti Rosaiah Passes Away, Former Chief Minister of unified Andhra Pradesh, Former CM Konijeti Rosaiah Passes Away, Konijeti Rosaiah, Konijeti Rosaiah Passes Away, Konijeti Rosaiah Passes Away At Age Of 88, Mango News, MangoNews, Rosaiah, Rosaiah Passes Away, Rosaiah Passes Away At Age Of 88

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఈ రోజు ఉదయం ఆయనకు బీపీ పడిపోవటంతో కుటుంబసభ్యులు ఆయనను స్టార్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించిన ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. కాగా, గత కొంతలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చివరిగా ఆయన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసారు. రోశయ్య మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ సంతాపం ప్రకటించారు.

1933 జులై 4 న గుంటూరు జిల్లా వేమవరంలో జన్మించిన ఆయన గుంటూరు పట్టణంలోని హిందూ కాలేజీలో విద్యాభ్యాసం చేసారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్ర్య సమర యోధుడు, రైతు నేత ఎన్ జీ రంగా గారికి ప్రియతమ శిష్యుడుగా మారారు. 1968 నుంచి రాజకీయాలలోకి అడుగు పెట్టిన ఆయన 1968, 1974, 1980, 2009 లో ఎమ్మెల్సీ గా పనిచేసారు. 1989, 2004 లో చీరాల నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 1998 లో నర్సరావుపేట నుంచి ఎంపీ గా ఎన్నికయ్యారు. 2009-210 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చివరి వరకు విధేయుడిగా పనిచేసారు. 2011-2016 మధ్య తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fifteen =