దూసుకొస్తున్న జవాద్ – ఒణుకుతున్న ఉత్తరాంధ్ర

Andhra Pradesh Cyclone Updates, Andhra pradesh Jawad Cyclone Update, ap cyclone Jawad effect, AP Cyclone Jawad Red Alert, ap cyclone updates, Cyclone Jawad Alert In Andhra, cyclone jawad current status, cyclone jawad imd Updates, cyclone jawad in andhra pradesh, cyclone jawad latest update, cyclone jawad speed, Cyclone Jawad Storm, Cyclone Jawad Storm For North Coastal Andhra Pradesh, Cyclone Jawad To Hit Andhra Pradesh, Jawad Cyclone, Jawad Cyclone Red Alert, Jawad IMD issues red alert, Mango News, Mango News Telugu, North Coastal Andhra Pradesh

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్ గా మారిందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ తీరానికి దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపు రాత్రి సమయానికి క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వివరించింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80 కి.మీ నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.

జవాద్ ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలియచేసింది. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. జవాద్ ప్రభావంతో తీరం వెంబడి సముద్రంలో 3.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడతాయని స్పష్టం చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జాలర్లు ఎవరు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =