ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా

#VizagSteelPlant, Centre Decision on Privatisation of Visakhapatnam Steel Plant, Centre Decision on Vizag Steel Plant, Centre finalizes privatization Visakhapatnam Steel Plant, Ganta Srinivasa Rao, Ganta Srinivasa Rao Resigns to MLA Post, Mango News, Privatisation of Visakhapatnam Steel Plant, Privatisation of Visakhapatnam Steel Plant News, privatisation of Vizag Steel Plant, Protest to Centre Decision on Vizag Steel Plant, TDP objects to privatisation of Vizag steel plant, Visakhapatnam, Visakhapatnam Steel Plant, Vizag Steel Plant, Vizag Steel Plant staff

విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు వెల్లడించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు పంపినట్టు తెలిపారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నానని, ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్టు గంటా తెలిపారు.

మరోవైపు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై విశాఖలో ఉద్యోగ, కార్మిక సంఘాల ఆందోళన మొదలైంది. కేంద్రం వెంటనే ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ విశాఖలో కార్మికులు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అలాగే పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటానికి సిద్ధమవుతామని ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి తెరపైకి వచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 6 =