సిట్టింగ్‌ల మార్పుపై గోరంట్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Gorants Interesting Comments On The Change Of Sittings, Gorants Interesting Comments, Interesting Comments On Change Of Sittings, Change Of Sittings, Gorants Comments On The Change Of Sittings, Gorantla Madhav, MP Gorantla Madhav, YCP, CM Jagan, Gorantla Madhav Latest Comments On Sittings, YCP Latest News On Sittings, Chandrababu Naidu, AP CM, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Gorantla madhav, MP Gorantla madhav, YCP, CM Jagan, AP Assembly elections

రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. ఈ మేరకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆచితూచి అడుగులేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈక్రమంలో దాదాపు 50 మంది సిట్టింగ్‌లకు షాక్ ఇచ్చేందుకు కూడా జగన్ వెనుకాడడం లేదు. ఇప్పటికే 11 జిల్లాల ఇంఛార్జ్‌లను మార్చేశారు.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల్లో ఎవరికి టికెట్ కన్‌ఫామ్.. మరెవరికి మార్పు తధ్యం.. స్థానం చలనం ఎవరికి అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

అయితే టికెట్ దక్కదని భావించిన కొందరు వైసీపీ నేతలు టీడీపీ, జనసేన పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కూడా జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే సమయంలో మరికొందరు మాత్రం ఏది ఏమయినా.. టికెట్ దక్కకపోయినా.. సీఎం జగన్ వెంటే ఉంటూ వైసీపీ జెండా మోస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తాం.. లేదంటే కార్యకర్తగా పని చేస్తామని అంటున్నారు.

ఇక వైసీపీ హైకమాండ్ ఇంఛార్జ్‌ల మార్పు అంశంపై స్పందిస్తూ.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఈసారి హైకమాండ్ తనకు టికెట్ ఇస్తుందో.. ఇవ్వదో తెలియదని వ్యాఖ్యానించారు. తనకు టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తన స్థానంలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. వారి గెలుపుకోసం కృషి చేస్తానని వెల్లడించారు. తాను సీఎం జగన్ సైనికుడనని.. ఆయ మాటే తనకు శిరోధర్యం అని వివరించారు. అన్ని కులాలకు, మతాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉండాలనేదే జగన్ ధ్యేయమని గోరంట్ల మాధవ్ వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 5 =