ఆరు నూరైనా మూడు రాజధానులను కొనసాగించి తీరుతాం – ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని

Gudivada MLA Kodali Nani Interesting Comments on Three Capitals For AP, Gudivada MLA Kodali Nani,Three Capitals of AP, Kodali Nani Remarks on Maha Padayatra, Kodali Nani Comments on Three Capitals of AP, Kodali Nani, Mango News, Mango News Telugu, Kodali Nani on Amaravati Farmers Three Capitals of AP, Three Capitals of AP, Amaravati Farmers, Maha Padayatra, AP Three Capitals, Kodali Nani Latest News And Updates, Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చేయడానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణను తీసుకొచ్చారని మాజీ మంత్రి, గుడివాడ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన గుడివాడ 17వ వార్డులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా? లేదా? అని ప్రశ్నించి సమస్యలు ఉన్నచోట వివరాలు నమోదు చేసుకున్నారు.

ఈ సందర్బంగా కొడాలి నాని మాట్లాడుతూ.. అమరావతి రైతులది ఆస్తుల కోసం ఆరాటమైతే, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని పేర్కొన్నారు. ఎవరెలా పోయినా తమ ఆస్తులు పెరగితే చాలని అమరావతి రైతులు, అక్కడ పెట్టుబడులు పెట్టినవారు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. అయినా అది అమరావతి కాదని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సృష్టించిన మాయా లోకం అని, అందుకే దానిని భ్రమరావతి అని పిలుస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని, ఆరు నూరైనా రాష్ట్రంలో మూడు రాజధానులను కొనసాగిస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు. టీడీపీ నేతలందరికీ అమరావతిలో భూములు ఉన్నాయని, అక్కడ భూములు కొన్నవారు మాత్రమే ఆ స్థలాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారని వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here