మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క‌ర్

Former MP Rapolu Ananda Bhaskar Joins TRS Party In the Presence of Working President KTR, Former MP Rapolu Ananda Bhaskar, MP Rapolu Ananda Bhaskar Joined TRS, Former MP Rapolu Ananda Bhaskar, Mango News,Mango News Telugu, BJP Leader Former MP Rapolu Ananda Bhaskar, BJP Leader Rapolu Ananda Bhaskar, Rapolu Ananda Bhaskar To Join TRS, BRS Party, TRS Party, BJP Party, Telangana Rastra Samithi, Baratiya Janatha Party, TRS Latest News ANd Updates

మాజీ ఎంపీ, ప‌ద్మ‌శాలి సంఘ నాయ‌కుడు రాపోలు ఆనంద భాస్క‌ర్ బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్)లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ సమక్షంలో రాపోలు ఆనంద భాస్క‌ర్ టీఆర్ఎస్ లో చేరగా, ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ సహా పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. చేనేత కుటుంబానికి చెందిన ఆనంద భాస్క‌ర్ 2012లో నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనంతరం 2019లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ చేరారు. కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని, చేనేతల పట్ల అవలంభిస్తున్న విధానాలలు సహా వివిధ కారణాలను పేర్కొంటూ బీజేపీ నుండి తక్షణమే వైదొలగుతున్నానని బుధవారం తన రాజీనామా లేఖను బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, చేనేత కళాకారుల పట్ల సంపూర్ణమైన అవగాహన, సామాజిక స్పృహ కలిగిన మంచి విద్యావేత్త మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క‌ర్ సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ లో, భవిష్యత్ లో బీఆర్ఎస్ లో చేనేతల తరపున గళాన్ని వినిపిస్తానంటూ ముందుకు వచ్చారని, పార్టీ తరపున స్వాగతం చెబుతున్నానని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ 8 ఏళ్ల కాలంలో వ్యవసాయం తరువాత ఆ స్థాయి, సత్తా కలిగిన రంగంగా చేనేత జౌళి శాఖ అని మారిందన్నారు. కాగా చేనేత రంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అవగాహనా లేకపోవడం వలన బంగ్లాదేశ్, శ్రీలంక కంటే కూడా దుస్తుల తయారీలో వెనుకబడి ఉన్న మాట వాస్తవమన్నారు. చేనేత జౌళి శాఖ మంత్రిగా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా చేనేత సమస్యలపై కేంద్రానికి ఎన్నో సార్లు విజ్ఞప్తులు చేశానని, కేంద్రం వైఖరిలో మార్పు లేదని మంత్రి కేటీఆర్ చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eleven =