పవన్ ప్రభంజనం ఓ రేంజ్‌లో ఉండనుందా?

How Many Seats Will Jana Sena Win In AP?, Jana Sena Seats, How Many Seats Jana Sena, Pithapuram, TDP BJP Janasena Alliance, Pawan Kalyan, Janasena, Jana Sena Win In AP?, Pawan Prabhanjanam, Pithapuram News, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pithapuram, TDP BJP Janasena Alliance, Pawan Kalyan, Janasena,Jana Sena win in AP?,Pawan Prabhanjanam

ఏపీలో జరగనున్న  ఎన్నికలలో  జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తూ అన్ని స్థానాలలో గెలవడానికి పావులు కదుపుతోంది. పొత్తులో భాగంగా సీట్లను త్యాగం చేసిన పవన్  కళ్యాణ్  ఈ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేసినా కూడా తమకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాలనే ఎంపిక చేసుకున్నారు.

జనసేన అభ్యర్థులు నిలబడుతున్న 21 నియోజకవర్గాల్లో 14 నుంచి 16 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి  సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది. మారిన రాజకీయ సమీకరణాలతో అభ్యర్థుల ఎంపికలో పవన్ తీసుకున్న జాగ్రత్తలు కూడా జనసేనకు కలిసి వస్తాయన్న టాక్ వినిపిస్తోంది.

మరికొద్ది రోజుల్లోనే జరగనున్న ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ  కూటమిలో మిగిలిన పార్టీలతో సంబంధం లేకుండానే  జనసేన తక్కువ స్థానాల్లో పోటీ చేసి 60 శాతానికి పైగా స్థానాల్లో విజయం సాధించి తమ పార్టీ సత్తా చాటడం గ్యారంటీ అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

దీనికితోడు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారన్న క్షణం నుంచి కూడా సీఎం జగన్ .. పిఠాపురంపైనే ఎక్కువ ఫోకస్ ఉంచారు. ఎన్ని కోట్లు ఖర్చయినా పర్వాలేదు పవన్ ఓడిపోవాలనే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అయితే జగన్  ఎంత ప్రయత్నిస్తున్నా పిఠాపురంలో జనసేన అధినేత  పవన్ కళ్యాణ్‌ను ఓడించడం అసాధ్యమన్న వార్తలు వినిపిస్తున్నాయి.పవన్‌కు దక్కబోయే విజయంతో ఇకపై  పిఠాపురం జనసేనకు కంచుకోట కాబోతుందనే  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకూ కూడా పవన్ వారాహి యాత్రలో భాగంగా పిఠాపురంలోనే ఉండనున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పవన్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరని.. అందరినీ కలుపుకొంటూ ముందుకెళ్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు జీరో బడ్జెట్ ఎలక్షన్ వర్కవుట్ అవదన్న సత్యాన్ని అర్ధం చేసుకున్న జనసేనాని ఈ ఎన్నికల కోసం ఎక్కువ మొత్తమే ఖర్చు చేయనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు  పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ నుంచి కూడా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో జనసేన ఎక్కువ సీట్లు గెలుచుకుంటే  మాత్రం ఆ ప్రభావంతో 2029 ఎన్నికల సమయానికి జనసేన మరింత బలంగా తయారువుతుందని..పవన్ సీఎం అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయన్న చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం  సాధిస్తే పిఠాపురం అభివృద్ధిని చూడాలని ఆశపడేవారి కోరిక తీరుతుందన్న వాదన వినిపిస్తోంది.  జనసేన పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ దశతో పాటు ఏపీ దిశ  కూడా మారుతుందని జనసైనికులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =