మరో 29 మంది సిట్టింగ్‌లకు జగన్ షాక్

Jagan Shocked 29 Other Sittings, 29 Other Sittings Shocked, Sittings Shocked, CM Jaganmohan Reddy, YCP, YCP Sitting MLAs, AP Assembly Elections, Latest YCP Sittings News, YCP Sittings News Update, YCP News, YCP Election News, CM Jagan, Andhra Pradesh, Ap Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
CM Jaganmohan Reddy, YCP, YCP Sitting MLAs, AP Assembly elections

ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు కొందరు సిట్టింగ్‌లను పక్కకు పెట్టడం తెలిసిన విషయమే. ప్రజాబలం తగ్గిన వారిని.. పనితీరు బాగోలేని వారిని సైడ్ చేస్తుంటాయి. అయితే ఎంత పక్కకు పెట్టినప్పటికే.. ప్రాంతీయ పార్టీలు సింగిల్ డిజిట్ సిట్టింగ్‌లనే మార్చేస్తుంటాయి. ఇప్పటి వరకు దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు సింగిల్ డిజిట్ సిట్టింగ్‌లనే మార్చేశాయి. జాతీయ పార్టీలు కూడా దాదాపు అలాగే మార్చేస్తుంటాయి. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సిట్టింగ్‌లకు బై బై చెప్పడం సంచలనంగా మారింది.

ఇప్పటికే రెండు దశల్లో ఇంఛార్జ్‌లను మార్చేశారు. మొదటి దశలో 11 మందికి షాక్ ఇస్తే.. రెండో దశలో 27 మందికి ఝలక్ ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 38 స్థానాలకు ఇంఛార్జ్‌లను మార్చేశారు. అందులో 35 అసెంబ్లీ స్థానాలకు.. 3 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్‌లను ఛేంజ్ చేశారు. ఇంతటితో ఆగకుండా మరికొంత మందిని కూడా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఆ జాబితాను కూడా సిద్ధం చేశారట. ఇంఛార్జ్‌ల మార్పు మూడో జాబితాను బుధవారం అధికారికంగా విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే మూడో జాబితాలో మొత్తం 29 స్థానాలకు జగన్మోహన్ రెడ్డి ఇంచార్జ్‌లను మార్చేశారట. దీంతో మూడో జాబితాతో కలిసి మొత్తం 67 స్థానాలకు జగన్ ఇంఛార్జ్‌లను మార్చినట్లు అవుతుంది. మూడో జాబితాలో నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలలోని స్థానాలకు ఇంఛార్జ్‌లు మార్చేశారట. ఇప్పటికే మార్పు గురించి సిట్టింగ్‌లకు అధినేత చెప్పేశారట. అంతేకాకుండా వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారట. పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన పదవులు ఇస్తామని హామీ కూడా ఇచ్చారట.

అయితే భారతీయ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో సిట్టింగ్‌లను మార్చడం ఇదే మొదటిసారి. జాతీయ పార్టీలు కూడా మహా అయితే 40, 50 స్థానాలకు సిట్టింగ్‌లను మార్చేశాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏకంగా 67 స్థానాలకు సిట్టింగ్‌లను మార్చేశారు.  మరి జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్‌లను మార్చి సక్సెస్ అవుతారా.. లేదా చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =