అన్ని తప్పులు చేసినా గెలుస్తారా?

Jagan's Hard Times?, Hard Time, AP, Telangana, TDP, Janasena, BJP, Congress,YCP, Jagan, Pawan, AP Election, Chandrababu, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP, Telangana, TDP, Janasena, BJP, Congress,YCP, Jagan ,Pawan,AP election,Chandrababu

మాట తప్పను..మడమ తిప్పను అంటూ పదే పదే చెబుతూ వస్తున్న ఏపీ సీఎం  జగన్‌కు మూడినట్టే కనిపిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. మాయమాటలతో జనాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌ చేసిన తప్పిదాలు, పాపాలు అన్నీఇన్నీకావని అంటున్నారు.నిజానికి ఈ ఐదేళ్ల పాలనలో వైసీపీ వైఫల్యాల గురించి రాస్తే మహా గ్రంధమే అవుతుంది.

ప్రభుత్వ సంస్థలను నీరు గార్చిన జగన్..అడ్డగోలు విధానాలతో ప్రభుత్వ ఉద్యోగులను నానా తిప్పలు పెట్టారు. అటు సచివాలయ ఉద్యోగాల చేత గొడ్డు చాకిరి చేయించుకుంటున్నారు. అసలు ఏపీలో ఏ ప్రభుత్వ ఉద్యోగీ కూడా జగన్‌కు ఓటేయరన్న విషయం ఎప్పుడో అందరికీ అర్ధం అయిపోయింది. 151 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న జగన్‌ రానున్న ఎన్నికల్లో 50కూడా తెచ్చుకోవడమే గగనమేనని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

మద్యపాన నిషేధం అంటూ మహిళల ఓట్లు దండుకున్న జగన్‌ ఆ పని చేయకపోగా ప్రభుత్వం చేతే మందు సీసాలు అమ్మిస్తున్న విషయాన్ని ఏపీ వాసులు ఎప్పటికీ మర్చిపోరు. అటు విచ్చలవీడిగా అప్పులు చేసిన వైసీపీ సర్కార్‌ రాష్ట్రాన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లింది. ప్రైవేట్‌ ఉద్యోగాలు లేక ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు సరిపోక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తోంది. ఏపీ రాజధాని నిర్మాణం సంగతి పక్కన పెడితే అసలు రాజధాని ఏంటో చెప్పలని పరిస్థితి దాపరించింది.

పరిపాలనా రాజధానిగా వైజాగ్‌ ఉంటుందని.. తన ఆఫీస్‌ కూడా విశాఖలోనే ఉంటుందని అనేకసార్లు చెప్పిన జగన్‌ ఇప్పటివరకు అక్కడకు ఎన్నిసార్లు వెళ్లారో ఆయనకే తెలియాలి. అప్పట్లో అమరావతి రైతులు ఉద్యమం ఓవైపు ఎగిసిపడుతూనే ఉండగా.. ఇటు జగన్‌ మాత్రం తుగ్లక్‌ నిర్ణయాలతో అసలు ఏం చేస్తున్నారో తనకే తెలియని అయోమయంలో కాలం నెట్టుకొచ్చారు. రాజధానిపై వైసీపీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడం నిజంగా ఘోరం. వైసీపీ చేసిన అతిపెద్ద తప్పుల్లో ఇదే ప్రథమంగా విశ్లేషకలు సైతం చెబుతారు

మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ-జనసేన-బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అసలు జగన్‌కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడని కూటమి పెద్దలు గట్టిగా ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా జనసేనాని పవన్‌కల్యాణ్ తన పదునైన వ్యూహాలతో దూసుకుపోతున్నారు. ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న పవన్‌.. ఈ నెల రోజులు మరింత దూకుడుగా వ్యవహరించనున్నారు.

ముఖ్యంగా మద్యపాన నిషేధం, రాజధాని నిర్మాణంలో అసమర్థ వైసీపీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా పాయింట్‌ టు పాయింట్‌ వివరణలు ఇస్తూ జనసైనికులు ఇప్పటికే జగన్‌కు చెమటలు పట్టిస్తున్నారు. మద్యపాన నిషేధమంటే కల్తీ సరుకు అమ్మడం కాదు. రాజధాని నిర్మాణమంటే నోటి మాటలు కాదు. ఈ సమస్యల పరిష్కారినికి ఎంతో ఆలోచన కావాలి.. జగన్‌కు అది లేదని ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =