జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పకడ్బందీ ఏర్పాట్లు, సభాస్థలిని పరిశీలించిన నాదెండ్ల మనోహర్

Janasena PAC Chairman Nadendla Manohar Inspects Arrangements for 10th Formation Day Meeting Venue at Machilipatnam,Janasena PAC Chairman Nadendla Manohar,10th Formation Day Meeting,Janasena Venue at Machilipatnam,Nadendla Manohar Inspects Arrangements,Mango News,Mango News Telugu,Jana Sena formation day fete,JSP formation day event,Many Join JSP ahead of Formation Day,Janasena Formation Day Meeting,Janasena Meeting on March 14th,Pawan Kalyan to Reach Venue,Pawan Kalyan on Varahi Vehicle,Janasena Chief Pawan Kalyan,AP Latest Political News,Janasena Formation Day Latest Updates

కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం వేదికగా మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సభ ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ప్రధాన వేదిక, డీ జోన్, వీర మహిళలు, మీడియా కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలు పరిశీలించారు. సభకు హాజరయ్యే ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని నాయకులకి సూచించారు. పనులు ఎంత వరకు వచ్చిందనే విషయం పరిశీలించి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ కు పలు సూచనలు చేశారు. పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని, సభకు తరలివచ్చే ఆశేష జనవాహినికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

జనసేన పార్టీలోకి చేరికలు:

మచిలీపట్నంలో జరగనున్న 10వ ఆవిర్భావ సభా ప్రాంగణం వద్ద పెడన, తిరువూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ వారందరికీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తిరువూరు మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకులు పసుపులేటి సురేష్, లింగినేని సుధాకర్, మైనారిటీ నాయకులు షేక్ ఫరీద్, కొలగాని అఖిల్, రామిశెట్టి జగన్, కస్తూరి ఓంకార్, గొడ్డేటి కరిముల్లా, పెడన నియోజకవర్గం చిట్టి గూడూరు మాజీ సర్పంచ్ వేము ఆంజనేయులు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో వీరంతా జనసేన పార్టీలోకి చేరారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 7 =