నన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టవచ్చు, కానీ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు, మనీశ్ సిసోడియా సందేశం

You Can Trouble Me by Putting Me in Jail but You Can't Break My Spirit Manish Sisodia's Message from Tihar Jail,Manish Sisodia's Message from Tihar Jail,Manish Sisodia Says You Can Trouble Me,Manish Sisodia Says You Can't Break My Spirit,Mango News,Mango News Telugu,Manish Sisodia's message from Tihar,You can trouble me by putting me in jail,You can trouble me but can't break my spirit,AAP Won't Break His Spirit,Lodged in Tihar jail, Delhi Liquor Scam Case Latest News,Delhi Live News,Excise Policy Case,Sisodia arrest,Manish Sisodia arrested,Delhi excise policy case,Indian Political News, National Political News

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైలు నుంచి మనీశ్ సిసోడియా సందేశం అంటూ, ఆయన అకౌంట్ ద్వారా మనీశ్ సిసోడియా టీమ్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. అందులో “సర్, నన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టవచ్చు. కానీ నా ఆత్మస్థైర్యాన్ని/సంకల్పాన్ని దెబ్బతీయలేరు. బ్రిటిష్ వారు స్వాతంత్య్ర సమరయోధులను కూడా ఇబ్బందులకు గురి చేశారు. కానీ వారి ఆత్మ స్థైర్యాన్ని కదిలించలేకపోయారు” అని మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.

ముందుగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఫిబ్రవరి 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మనీశ్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం సీబీఐ వాదనలు మేరకు కోర్టు సిసోడియాను మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అయితే సిసోడియా బెయిల్ పిటిషన్ శుక్రవారం కోర్టులో విచారణకు వచ్చే క్రమంలో, ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలతో మనీశ్ సిసోడియాను ఈడీ గురువారం అరెస్టు చేసింది. అనంతరం సిసోడియాను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ శుక్రవారం కోర్టును ఆశ్రయించి వాదనలు వినిపించింది. ఈడీ అధికారుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కోర్టు, సిసోడియాను ఏడు రోజుల పాటుగా మార్చి 17 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే తన అరెస్ట్, విచారణలపై మనీశ్ సిసోడియా తన సందేశాన్ని ట్విట్టర్ లో పోస్టు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =