కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

KCR Should Recover Soon Chandrababu,KCR Should Recover Soon,Chandrababu on KCR Recover,Chandrababu naidu, kcr, KCR in hospital, Yashoda hospital, brs, tdp,Mango News,Mango News Telugu,TDP chief Chandrababu Naidu,KCR Recovering Well,Former Telangana CM KCR,Several leaders visit former CM KCR,Chandrababu Latest News,Chandrababu Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Chandrababu naidu, kcr, KCR in hospital, Yashoda hospital, brs, tdp

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తీవ్ర గాయమయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శిస్తున్నారు. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను కలిశారు.

సోమవారం చంద్రబాబు నాయుడు యశోద ఆసుపత్రికి వెళ్లారు. ముందుగా అక్కడి వైద్యులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆ తర్వాత కేసీఆర్‌ వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు. కేసీఆర్‌తో మాట్లాడాలనిపించి ఆసుపత్రికి వచ్చానని చెప్పారు. కేసీఆర్ కోలుకోవడానికి మరో ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని వివరించారు. త్వరగా కేసీఆర్ కోలుకొని ప్రజా సేవకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.

మరోవైపు సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 14 =