లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి?

Revanth Reddy as TPCC Chief Until the End of the Lok Sabha Elections,Revanth Reddy as TPCC Chief,TPCC Chief Until the End,End of the Lok Sabha Elections,Mango News,Mango News Telugu,Revanth reddy, TPCC Chief, Congress Highcommand,Election Results 2023 Highlights,TPCC Chief Revanth Reddy Latest News,Lok Sabha Elections Latest Updates,Revanth Reddy Latest News,Revanth Reddy Latest Updates,Revanth Reddy Live News,Congress High command News,Telangana Latest News And Updates
Revanth reddy, TPCC Chief, Congress Highcommand

దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో చక్రం తిప్పుతోంది హస్తం పార్టీ. కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా అధికారంలోకి  రావడంతో.. కాంగ్రెస్‌ జోష్ రెట్టింపు అయింది. తెలంగాణలో పదేళ్ల తర్వాత హస్తం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు అడుగులేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రెండింటిని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చింది. మిగిలిన గ్యారెంటీలను కూడా వంద రోజుల్లో నెరవేర్చుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అయితే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంతో.. తెలంగాణలో పీసీసీ పదవి ఖాళీ అయింది. ఆ పదవిని ఎవరికి ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సమర్థుడైన నేతకు పీసీసీ పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేజిక్కించుకోక ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉండేది. చాలా మంది తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందంటే.. అందుకు కారణం రేవంత్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వాటన్నింటిని అధిగమించి ముందుకు నడిపించారు. విజయతీరాలకు చేర్చారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గినట్టే.. లోక్ సభ ఎన్నికల్లో కూడా నెగ్గాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోంది. అలా నెగ్గాలంటే రేవంత్ రెడ్డితోనే సాధ్యమని హైకమాండ్ భావిస్తోంది. రేవంత్ రెడ్డి సారధ్యంలోనే లోక్‌సభ ఎన్నికలకు కూడా వెళ్లాలని భావిస్తోంది. అందుకే లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు రేవంత్ రెడ్డినే తెలంగాణ పీసీసీ చీఫ్‌గా కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో పీసీసీ చీఫ్ పదవి కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పీసీసీ రేసులో ఉన్నారు. ఎవరికి వారు తమకే పీసీసీ పదవి కట్టబెట్టాలని అధిష్టానం వద్ద పట్టుపట్టుకొని కూర్చుకున్నారు. కానీ అటు హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై కాంగ్రెస్ హైకమాండ్‌ అధికారికంగా  ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మరి పీసీసీ పదవి రేవంత్ రెడ్డికే ఇస్తే భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఏం చేస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 5 =