మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సు ప్రారంభించిన ప్రధాని మోదీ, పాల్గొన్న సీఎం జగన్

AP CM Jagan, AP CM Jagan and others Participated In Maritime India Summit, AP CM YS Jagan, India aims to operationalize 23 domestic waterways, Mango News, Maritime India Summit, Maritime India Summit-2021, PM Modi, PM Modi Inaugurates Maritime India Summit, PM Modi Inaugurates Maritime India Summit-2021, PM Modi inaugurates second edition of Maritime India Summit

మారిటైమ్ ఇండియా సమ్మిట్-2021 ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డెన్మార్క్ రవాణా శాఖ మంత్రి బెన్నీ ఎంగ్లెబ్రెచ్ట్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవియా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశ వృద్ధిపథంలో భాగం కావాలని ప్రపంచ దేశాలను ఆహ్వానించారు. సముద్రరంగంలో వృద్ధి చెందడం మరియు ప్రపంచంలోని ప్రముఖ బ్లూ ఎకానమీగా అవతరించడంపై గొప్ప ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సంస్కరణలు పెంచడం, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలోపేతం చేసే దిశగా వెళ్తున్నామని అన్నారు. దేశంలో ప్రధాన పోర్టుల సామర్థ్యం 2014 లో 870 మిలియన్ టన్నుల ఉండగా ఇప్పుడు 1550 మిలియన్ టన్నులకు పెరిగిందని తెలిపారు. డైరెక్ట్ పోర్ట్ డెలివరీ, డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ, అప్‌గ్రేడ్ పోర్ట్ కమ్యూనిటీ సిస్టమ్ తో పాటుగా ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ కార్గో కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం వంటి చర్యలు భారత పోర్టులలో ఉన్నాయని చెప్పారు.

రాష్ట్రంలో హరిత క్షేత్ర ఓడరేవుల అభివృద్ధి: సీఎం జగన్

మరోవైపు ఈ ప్రారంభోత్సవ సమావేశంలో వర్చువల్‌ గా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడారు. 2030 నాటికి దేశీయ దిగుమతుల్లో కనీసం 10 శాతం దిగుబడులు ఆంధప్రదేశ్ రాష్ట్రం నుంచి జరగాలనేదే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రానికి సువిశాలమైన 974 కి.మీ. తీరప్రాంతం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నౌకాశ్రయాలపై ఆధారపడి రాష్ట్రానికి ఇటీవల కాలంలో పలు పరిశ్రమలు వచ్చాయని చెప్పారు. ఈ రంగంలో మరింతగా అవకాశాలు అందుకునే దిశగా రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు వద్ద హరిత క్షేత్ర ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ తాజా ర్యాంకింగ్స్‌ ప్రకారంగా సులభతర వాణిజ్యంలో (ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్) లో రాష్ట్రం తొలిస్థానంలో నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని సదస్సుకు హాజరైన దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులందరినీ సీఎం‌ ఆహ్వానించారు. ప్రభుత్వపరంగా అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 19 =