కాషాయపు పార్టీలోకి కేశినేని జంప్..?

Keshineni Nani to Join BJP, Nani to Join BJP, Keshineni Nani to BJP, MP Kesineni Nani, Vijayawada, Telugu Desam Party, BJP, Latest Keshineni Nani News, Keshineni Nani Polictical News, AP BJP News, Modi, CM Jagan, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
MP Kesineni Nani, Vijayawada, Telugu desam Party, BJP

బెజవాడ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఎంపీ కేశినేని నానిని టీడీపీ హైకమాండ్ పక్కకు పెట్టేయడంతో.. బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే తెలుగు దేశం పార్టీకే త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించి కేశినేని నాని మరింత హీట్ పెంచేశారు. త్వరలో తన ఎంపీ పదవికి.. తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఇటీవల కేశినేని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడికి.. టీడీపీకి తన అవసరం లేదని భావించిన తర్వాత.. తాను కూడా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని తన భావని అని నాని పేర్కొన్నారు.

మరి నాని టీడీపీకి గుడ్ బై చెప్పి.. ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులుగా కేశినేని వైసీపీకి దగ్గరగా ఉంటున్నారు. వైసీపీ నాయకులతో కూడా కేశినేని కలివిడిగా వ్యవహరిస్తున్నారు. గతంలోనే ఓసారి కేశినేనికి వైసీపీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అప్పట్లోనే కేశినేని వైసీపీలో చేరుతారని అంతా భావించినప్పటికీ అది జరగలేదు. ఇక ఇప్పుడైనా నాని వైసీపీలో కండువా కప్పుకుంటారని కొద్దిరోజులగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పుడు మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. వైసీపీ కాకుండా.. భారతీయ జనతా పార్టీలో నాని చేరబోతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కేశినేని నాని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కూడా నాని కలిశారు. అప్పట్లో బీజేపీ-టీడీపీ మధ్య వైరం కొనసాగుతుండడంతో.. నాని మోడీని కలవడం పట్ల చంద్రబాబు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు నాని బీజేపీ వైపు చూస్తున్నారట.

వాస్తవానికి కేశినేని నానికి రాష్ట్రస్థాయిలో రాజకీయాలు చేయాలని లేదట. రాష్ట్రస్థాయిలో ఇమడలేనని.. కేంద్రస్థాయిలోనే జాతీయ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారట. అందుకే బీజేపీలోకి వెళ్తేనే కరెక్ట్ అని కేశినేని భావిస్తున్నారట. గతంలో ఓసారి టీడీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని కేశినేని ప్రకటించారు. ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందిన తర్వాత బీజేపీలోకే వెళ్తే ప్రధాన్యత ఉంటుందని మరో ఆలోచన చేస్తున్నారట కేశినేని నాని. అటు తయన క్యాడర్ కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అంటోందట. మరి నాని ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =