సంచలన నిర్ణయం తీసుకున్న కేశినేని నాని

Keshineni Nani Took a Sensational Decision, Keshineni Nani Sensational Decision, Sensational Decision Keshineni Nani, Sensational Decision, Kesineni Nani, Telugu Desam Party, Vijayawada, Latest Keshineni Nani News, Keshineni Nani TDP News, Keshineni Nani Political News, TDP News, chandrababu, TDP, CM Jagan, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Kesineni nani, Telugu desam party, vijayawada

బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీకి, లోక్ సభ సభ్యత్వానికి త్వరలో రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు.  వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తాను తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు కేశినేని నాని ప్రకటించారు.

‘‘చంద్రబాబు నాయుడు పార్టీకి నా అవసరం లేదని భావించిన తర్వాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్‌ను కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను’’ అంటూ కేశినేని నాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీంతో కేశినేని నాని తీసుకున్న నిర్ణయం బెజవాడతో పాటు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.

ఇకపోతే 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తరుపున గుంటూరు నుంచి పోటీ చేసి కేశినేని నాని గెలుపొందారు. కానీ 2019 ఎన్నికల తర్వాత నుంచి టీడీపీ అధిష్టానానికి నానికి మధ్య పొసగడం లేదు. దీంతో పలుమార్లు నాని టీడీపీ హైకమాండ్‌పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఓసారి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ గెలుపొందదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు.. నానిని పక్కకు పెడుతూ వస్తున్నారు. అటు కేశినేని నాని కూడా తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని ఫిక్స్ అయిపోయి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

అయితే త్వరలో తెలుగు దేశం పార్టీ తిరువూరులో బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నానికి టీడీపీ సూచించింది. అలాగే వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ వేరే వారికి ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. కేశినేని సోదరుడు కేశినేని చిన్నికి ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  ఈక్రమంలో కేశినేని నాని తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అయితే గతంలో ఓసారి టీడీపీ టికెట్ ఇవ్వకపోతే గుంటూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కేశినేని ప్రకటించారు. అటు వైపీపీ కూడా నానిని తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఈక్రమంలో నాని వైసీపీలో చేరుతారా..? లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 9 =