సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానన్న టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఎందుకొచ్చారు? – మంత్రి ఆర్కే రోజా

Minister RK Roja Sensational Comments on TDP Chief Chandrababu After MLC Elections Results,Minister RK Roja Sensational Comments,Roja Comments on TDP Chief Chandrababu,Minister RK Roja After MLC Elections Results,TDP Chief Chandrababu After MLC Elections Results,Mango News,Mango News Telugu,MLC Elections 2023,MLC Elections Results 2023,Minister RK Roja Latest News,Chandrababu Vs Minister RK Roja,Minister RK Roja Shocking Comments,MInister Roja Slams Chandrababu,MLC Elections Latest News and Updates

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించడంపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. టీడీపీది అనైతిక విజయమని పేర్కొన్న ఆమె ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆమె మరో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డితో కలిసి గన్నవరంలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆవరణలో డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొనుగోలు రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోసారి రుజువైందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానన్న చంద్రబాబు నిన్న ఎందుకొచ్చారు? అని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు, అదే 23 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, 2024 సాధారణ ఎన్నికల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగులుతారని జోస్యం చెప్పారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డిని మోసం చేసినవారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని పేర్కొన్న మంత్రి రోజా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటో త్వరలో తేలుతుందని హెచ్చరించారు. టీడీపీకి ఓటు వేసినవారు రాజకీయంగా పతనమైనట్లేనని, చంద్రబాబును నమ్ముకున్నవారికి భవిష్యత్ ఉండదని వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =